Amala Paul : తెలుగు ఇండస్ట్రీలో నెపోటిజం ఉంది.. ఇక్కడ సినిమాల్లో ఇద్దరు హీరోయిన్స్ ఉండాల్సిందే.. అందుకే..

అమలాపాల్ మాట్లాడుతూ.. ''నేను తెలుగు ఇండ‌స్ట్రీకి వెళ్లిన‌పుడు అక్క‌డ నెపోటిజం, ఫ్యామిలీ కాన్సెప్ట్ ఉంద‌ని అర్థమైంది. తెలుగు ఇండస్ట్రీలో అక్కడ స్టార్ల కుటుంబాల ఆధిపత్యం ఎక్కువ. వాళ్ళు తీసే సినిమాలు చాలా.............

Amala Paul : తెలుగు ఇండస్ట్రీలో నెపోటిజం ఉంది.. ఇక్కడ సినిమాల్లో ఇద్దరు హీరోయిన్స్ ఉండాల్సిందే.. అందుకే..

Amala Paul :  మలయాళం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అమలాపాల్ తెలుగులో బెజవాడ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగు, తమిళ్ లో వరుసగా సినిమాలు చేసిన అమలాపాల్ ఇటీవల తెలుగు సినిమాల్లో ఎక్కువగా కనపడట్లేదు. కానీ రెగ్యులర్ గా తమిళ్ సినిమాలు చేస్తుంది. తాజాగా ఇచ్చిన ఓ తమిళ్ ఇంటర్వ్యూలో తెలుగు ఇండస్ట్రీపై సంచలన వ్యాఖ్యలు చేసింది అమలాపాల్.

Krishnam Raju with Tiger : కృష్ణంరాజుకి ఒక పులి ఫ్యాన్ అని మీకు తెలుసా..? రియల్ పులితో ఫైట్ చేసి మచ్చిక చేసుకున్న రెబల్ స్టార్..

అమలాపాల్ మాట్లాడుతూ.. ”నేను తెలుగు ఇండ‌స్ట్రీకి వెళ్లిన‌పుడు అక్క‌డ నెపోటిజం, ఫ్యామిలీ కాన్సెప్ట్ ఉంద‌ని అర్థమైంది. తెలుగు ఇండస్ట్రీలో అక్కడ స్టార్ల కుటుంబాల ఆధిపత్యం ఎక్కువ. వాళ్ళు తీసే సినిమాలు చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. అన్నీ కమర్షియల్ సినిమాలే ఉంటాయి. అక్కడ సినిమాల్లో చాలావరకు ఇద్ద‌రు హీరోయిన్లు ఉండాల్సిందే. ప్రేమ స‌న్నివేశాలు, పాట‌లు.. అన్నీ గ్లామరస్ కోసమే చూస్తారు. అందుకే అవన్నీ నాకు నచ్చక తెలుగులో చాలా సినిమాలు వదులుకున్నాను. తెలుగు ఇండ‌స్ట్రీతో ఎక్కువగా క‌నెక్ట్ అవ్వ‌లేక‌పోయాను” అని చెప్పింది. దీంతో అమలాపాల్ చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ లో వైరల్ గా మారాయి.