పదేళ్ల వివాహ బంధం పూర్తి చేసుకున్న అనసూయ

10TV Telugu News

అందాల భామ అనసూయ..న్యూస్ రీడర్ గా కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత యాంకరింగ్ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. జబర్దస్ టీవీ షోలో తన అభియనం, మాటలతో అందరినీ ఆకట్టుకుంది. ఒక వైపు యాంకరింగ్ చేస్తూనే మరోవైపు నటిగా కూడా తనను తాను నిరూపించుకుంటోంది. సోషల్ మీడియాలో కూడా చురుగ్గా ఉంటుంది. అనసూయ పదేళ్ల వివాహ బంధం పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ట్విటర్ లో తన భర్త సుశాంక్ భరద్వాజ్ తో కలిసి ఉన్న ఫొటోలను పోస్ట్ చేసింది. 

అనసూయది ప్రేమ పెళ్లి అనే విషయం తెలిసిందే. అనసూయ లవ్ స్టోరీ చూసినట్లైతే ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువుతున్నపుడు అనసూయ ఎన్ సీసీ క్యాంపుకు వెళ్లింది. అదే ఎన్ సీసీ క్యాంపుకు సుశాంక్ భరద్వాజ్ కూడా వెళ్లాడు. సుశాంక్ మొదట అనసూయను పెళ్లి చేసుకుంటానని ప్రపోజ్ చేస్తే..అనసూయ ఏం సమాధానమివ్వలేదట. 

ఏడాదిన్నర తర్వాత మరోసారి ఎన్ సీసీ క్యాంపుకు వెళ్లిన సమయంలో భరద్వాజ్ తో స్నేహం ఏర్పడిందని అనసూయ ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. తనకు ప్రపోజ్ చేసిన తొమ్మిదేళ్లకు భరద్వాజ్ తో పెళ్లి జరిగిందని పేర్కొంది. తమ ప్రేమ విషయం ఇంట్లో చెబితే ఒప్పుకోకపోవడంతో.. తాను భరద్వాజ్ ను తప్ప వేరేవాళ్లని పెళ్లి చేసుకోనని చెప్పడంతో అందరూ దగ్గరుండి పెళ్లిచేసినట్లు వివరించింది. 

Read: నెటిజన్ అసభ్యకర కామెంట్..వైరల్ అవుతున్న బాలీవుడ్ నటి సమాధానం

×