Avatar 2: ఓటీటీ స్ట్రీమింగ్‌కు రెడీ అయిన అవతార్-2.. ఆడియెన్స్‌ను రెడీ కమ్మంటున్న టీమ్!

హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ జేమ్స్ కామెరాన్ తెరకెక్కించిన విజువల్ వండర్ మూవీ ‘అవతార్’ గతంలో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమాకు కొనసాగింపుగా ‘అవతార్ 2’ మూవీ రావడంతో ఈ సినిమాను చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టారు. ఇక వారి అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉండటంతో ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు.

Avatar 2: ఓటీటీ స్ట్రీమింగ్‌కు రెడీ అయిన అవతార్-2.. ఆడియెన్స్‌ను రెడీ కమ్మంటున్న టీమ్!

Avatar 2 Locks OTT Streaming Date

Avatar 2: హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ జేమ్స్ కామెరాన్ తెరకెక్కించిన విజువల్ వండర్ మూవీ ‘అవతార్’ గతంలో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమాకు కొనసాగింపుగా ‘అవతార్ 2’ మూవీ రావడంతో ఈ సినిమాను చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టారు. ఇక వారి అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉండటంతో ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు.

Avatar 2: మరో మైల్‌స్టోన్ క్రాస్ చేసిన అవతార్-2.. ఏకంగా రెండు బిలియన్ డాలర్లు వసూలు!

కట్ చేస్తే.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఏకంగా 2.82 బిలియన్ డాలర్ల వసూళ్లు రాబట్టి వరల్డ్ టాప్ 3వ హయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. ఇక ఈ సినిమాలోని గ్రాఫిక్స్‌కు ప్రేక్షకులు నోరెళ్లబెట్టారు. ఈ సినిమాను ఖచ్చితంగా ఒక్కసారైనా చూడాల్సిందే అంటూ థియేటర్లలో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ అందించారు ప్రేక్షకులు. ఇక ఈ సినిమా ఆస్కార్ బరిలో పలు విభాగాల్లో నామినేట్ కావడంతో, ఇప్పుడు అందరి చూపు ఈ సినిమాకు ఎన్ని అవార్డులు దక్కుతాయా అనే అంశంపై పడ్డాయి.

Avatar 2: చరిత్ర సృష్టించిన అవతార్-2.. ఇండియాలో హయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలిచిన విజువల్ వండర్!

కాగా, ఈ సినిమాను ఓటీటీలో ఎప్పుడెప్పుడు స్ట్రీమింగ్ చేస్తారా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. అయితే ఈ సినిమాను ఎట్టకేలకు ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈ సినిమాను మార్చి 28 నుండి ఓటీటీ ప్లాట్‌ఫాంలో స్ట్రీమింగ్ చేసేందుకు ప్రైమ్ వీడియో రెడీ అయ్యింది. ప్రైమ్ వీడియోతో పాటు యాపిల్ టీవీ, వూడులో కూడా ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి బిహైండ్ ది సీన్స్ కూడా ఏకంగా మూడు గంటలకుపైగా ఉండనుండటంతో ప్రేక్షకులకు అదిరిపోయే అనుభూతి లభిస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. మరి ఈ ప్రెస్టీజియస్ మూవీకి ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందో చూడాలి.