Bahubali 2 : ఇప్పటికి అందులో బాహుబలి 2 రికార్డ్‌ని ఎవ్వరు టచ్ చేయలేదు.. జవాన్ వల్ల కూడా కాలేదు..

ఎంత ప్రయత్నించినా బాహుబలి సెట్ చేసిన రికార్డుల్లో ఒక రికార్డ్ మాత్రం ఇంకా ఏ సినిమా బద్దలు కొట్టలేదు. ఎన్నో అంచనాలతో వచ్చిన జవాన్ సినిమా కూడా బాహుబలి 2 రికార్డుని బద్దలు కొట్టలేకపోయింది.

Bahubali 2 : ఇప్పటికి అందులో బాహుబలి 2 రికార్డ్‌ని ఎవ్వరు టచ్ చేయలేదు.. జవాన్ వల్ల కూడా కాలేదు..

Bahubali 2 Multiplex Record safe even Shahrukh Khan Jawan cant beat that Bahubali 2 Record

Updated On : September 8, 2023 / 8:47 AM IST

Bahubali 2 : బాహుబలి సినిమాలు దేశమంతటా ఎంత భారీ విజయాన్ని సాధించాయి అందరికి తెలిసిందే. బాహుబలి 2 సినిమా అయితే అనేక చోట్ల సరికొత్త రికార్డులని సెట్ చేసింది. సినిమా వచ్చి 6 ఏళ్ళు అవుతున్నా ఇంకా ఆ సినిమా క్రియేట్ చేసిన రికార్డులు బద్దలు కొట్టడానికి చాలా సినిమాలు ట్రై చేస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా బాలీవుడ్(Bolywood) సినిమాలు బాహుబలి 2 రికార్డులు బద్దలు కొట్టడానికి తెగ ట్రై చేస్తున్నాయి.

ఇటీవల షారుఖ్(Shahrukh Khan) పఠాన్(Pathaan) సినిమా హిందీలో అత్యంత ఎక్కువ గ్రాస్ కలెక్ట్ చేసిన సినిమాగా నిలిచి బాహుబలి రికార్డుని బద్దలు కొట్టింది. ఇలా ఏదో ఒక సినిమా బాహుబలి రికార్డులని ఎలాగోలా బద్దలు కొట్టడానికి ట్రై చేస్తూనే ఉన్నాయి. తాజాగా షారుఖ్ జవాన్(Jawan) సినిమా రిలీజయి భారీ విజయం సాధించింది. ముందు నుంచే అడ్వాస్ బుకింగ్స్ తో రికార్డులు సెట్ చేసి కలెక్షన్స్ తో సరికొత్త రికార్డ్ సెట్ చేయడానికి ఎదురు చేస్తుంది జవాన్.

అయితే ఎంత ప్రయత్నించినా బాహుబలి సెట్ చేసిన రికార్డుల్లో ఒక రికార్డ్ మాత్రం ఇంకా ఏ సినిమా బద్దలు కొట్టలేదు. ఎన్నో అంచనాలతో వచ్చిన జవాన్ సినిమా కూడా బాహుబలి 2 రికార్డుని బద్దలు కొట్టలేకపోయింది. ఇంతకీ ఆ రికార్డ్ ఏంటంటే.. దేశంలోని అన్ని మల్టీప్లెక్స్ థియేటర్స్ లో అడ్వాన్స్ బుకింగ్స్ లో ఎక్కువ టికెట్స్ అమ్మయుడయిన రికార్డ్ ఇప్పటికి కూడా బాహుబలి 2 పేరు మీదే ఉంది. బాహుబలి 2 సినిమా రిలిజ్ కి ముందు దాదాపు 6 లక్షల 50 వేలకు పైగా అడ్వాన్స్ టికెట్స్ అమ్ముడుపోయాయి.

Vishal : నిర్మాతలు బ్లాక్ మెయిల్ చేసేవాళ్ళు.. అందుకే నిర్మాణ సంస్థ మొదలుపెట్టా.. విశాల్ సంచలన వ్యాఖ్యలు..

ఈ రికార్డుని బద్దలు కొట్టడానికి చాల సినిమాలు ట్రై చేశాయి. KGF 2 సినిమా 5 లక్షల టికెట్లు దాటి దగ్గరికి వచ్చింది. కానీ ఇటీవల షారుఖ్ పఠాన్ సినిమాతో 5 లక్షల 50 వేలు దాటగా తాజాగా జవాన్ సినిమా 5 లక్షల 59 వేల వరకు వచ్చి ఆగిపోయింది. దీంతో ఇప్పుడు బాహుబలి 2 తర్వాత షారుఖ్ జవాన్, పఠాన్ సినిమాలు నిలిచాయి. మరి అడ్వాన్స్ బుకింగ్స్ లో బాహుబలి 2 రికార్డుని ఎవరు బద్దలుకొడతారో చూడాలి.