Balakrishna : అఖండ సినిమాకు ప్రభుత్వాలు సహకరించలేదు.. సినిమాలు కూడా ప్రభుత్వానికి ఆదాయాన్ని ఇస్తాయి..
ఈ ఈవెంట్లో బాలకృష్ణ సినిమా గురించి, ఎన్టీఆర్ గురించి, అభిమానుల గురించి మాట్లాడారు. అనంతరం సినిమాలకు ప్రభుత్వాలు సహకరించాలని వ్యాఖ్యలు చేశారు.

Balakrishna Sensational Comments on Governments in Bhagavanth Kesari Movie Trailer Launch Event
Balakrishna : అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో బాలకృష్ణ (Balakrishna) హీరోగా తెరకెక్కుతున్న సినిమా భగవంత్ కేసరి(Bhagavanth Kesari). బాలయ్యకు జోడిగా కాజల్ అగర్వాల్(Kajal Aggarwal) నటిస్తోండగా శ్రీలీల(Sreeleela) బాలయ్య బాబుకి కూతురి పాత్రలో కనిపించనుంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ విలన్‌గా కనిపించనున్నాడు. థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.
తాజాగా నేడు భగవంత్ కేసరి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ వరంగల్ లో జరిగింది. ఈ ఈవెంట్ కి బాలకృష్ణ, కాజల్, శ్రీలీల, చిత్రయూనిట్ అంతా హాజరయ్యారు. ఈవెంట్ కి బాలయ్య అభిమానులు, ప్రేక్షకులు చాలా మంది వచ్చి సందడి చేశారు. ఇక ఈ ఈవెంట్లో బాలకృష్ణ సినిమా గురించి, ఎన్టీఆర్ గురించి, అభిమానుల గురించి మాట్లాడారు. అనంతరం సినిమాలకు ప్రభుత్వాలు సహకరించాలని వ్యాఖ్యలు చేశారు.
Also Read : Vamshi Paidipally : మా మామయ్యకి క్యాన్సర్ వస్తే.. అందరూ చెప్పిన పేరు ఒకటే బసవతారకం హాస్పిటల్..
బాలకృష్ణ మాట్లాడుతూ.. కరోనా తర్వాత థియేటర్లకు ప్రజలు వస్తారో రారో అన్న ఆలోచనలో ఉన్నారు అందరూ. ఆ సమయంలోనే అఖండ సినిమా రిలీజ్ చేశాము. కానీ అప్పుడు ప్రభుత్వాలు మాకు సహకరించలేదు. ఎక్స్ ట్రా షోలు లేవు, రేట్లు పెంచలేదు. అయినా రిలీజ్ చేసి హిట్ కొట్టాము. రికార్డ్స్ సృష్టించాము. ఆదాయం వచ్చేదాన్ని ప్రభుత్వాలు గుర్తించాలి. సినిమాల ద్వారా కూడా ప్రభుత్వానికి ఆదాయాలు వస్తాయి. గుర్తించి సినిమాలకు సహకరించాలి అని అన్నారు. దీంతో బాలయ్య చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.