Sunny Deol : అప్పు ఎగ్గొట్టిన బాలీవుడ్ హీరో.. విల్లా వేలానికి పెట్టిన బ్యాంక్
గదర్ 2 సినిమా బ్లాక్ బాస్టర్‌గా నిలవడంతో బాలీవుడ్ నటుడు సన్నీడియోల్ (Sunny Deol) పుల్ జోష్‌లో ఉన్నారు. అయితే.. ఈ హీరోకు సంబంధించిన ఓ వార్త వైరల్‌గా మారింది.

Sunny Deol
Sunny Deols Juhu Villa : ‘గదర్ 2’ సినిమా బ్లాక్ బాస్టర్‌గా నిలవడంతో బాలీవుడ్ నటుడు సన్నీడియోల్ (Sunny Deol) పుల్ జోష్‌లో ఉన్నారు. అయితే.. ఈ హీరోకు సంబంధించిన ఓ వార్త వైరల్‌గా మారింది. ఓ బ్యాంకులో కోట్ల రూపాయలను అప్పుగా తీసుకున్న ఈ హీరో దాన్ని తిరిగి చెల్లించడంలో విఫలం అయ్యాడట. దీంతో గ్యారెంటీగా పెట్టిన అతడికి చెందిన ఖరీదైన విల్లాను సదరు బ్యాంకు వేలం వేయడానికి సిద్ధమైంది. ఇందుకు సంబంధించి ఓ పత్రికా ప్రకటనను కూడా ఇచ్చింది.
ముంబయి నగరంలోని జుహూ ప్రాంతంలోని గాంధీగ్రామ్ రోడ్‌లో సన్నీ డియోల్ కి ఓ విల్లా ఉంది. కొంతకాలం క్రితం సన్నీడియోల్ ఈ విల్లాను గ్యారెంటీగా పెట్టి బ్యాంక్ ఆఫ్ బరోడాలో రూ.56 కోట్ల రుణం తీసుకున్నాడు. అయితే.. దాన్ని తిరిగి చెల్లించడంలో విఫలం అయ్యాడు. బ్యాంకు ఎన్నిసార్లు నోటీసులు పంపినా స్పందించలేదు. లోన్ రికవరీలో భాగంగా సన్నీ విల్లాను వేలం వేయాలని బ్యాంకు నిర్ణయించింది. ఈ క్రమంలోనే ఆదివారం (ఆగస్టు 20న) అన్ని దినపత్రికల్లో విల్లాను వేలం వేస్తున్నట్లు ఓ ప్రకటనను ఇచ్చింది.
Guntur Kaaram : గుడ్ న్యూస్ చెప్పిన మహేష్ బాబు.. సంక్రాంతి బరిలో ‘గుంటూరు కారం’..
సన్నీ డియోల్.. తన తండ్రి ధర్మేంద్ర, సోదరుడు బాబీతో పాటు జుహూలోని విల్లాను గ్యారంటర్లుగా చూపించి రుణం తీసుకున్నట్లు ఆ ప్రకటనలో ఉంది. ఈ రుణానికి వడ్డీ కూడా చెల్లించాలని తెలిపింది. సెప్టెంబర్ 25న సదరు విల్లాను వేలం వేయనున్నారు. ఈ వేలంలో పాల్గొనాలనుకున్న వారు రూ.5.14 కోట్లు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ వార్త బాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.
కాగా.. దీనిపై సన్నీ డియోల్ ప్రతినిధి స్పందించారు. సమస్యను పరిష్కరించే ప్రక్రియ కొనసాగుతుందన్నారు. త్వరలోనే అన్నీ సద్దుమణుగుతాయన్నారు. ఈ వ్యవహారంపై ఎలాంటి ఊహాగానాలను వ్యాప్తి చేయవద్దని విజ్ఞప్తి చేశారు.
Kushi : తమిళనాడులో విజయ్ దేవరకొండ ‘ఖుషి’ ప్రమోషన్స్.. ఈసారి పాన్ ఇండియా హిట్ కొట్టాల్సిందే..

Bank to auction Sunny Deol’s Juhu bungalow