Kushi : తమిళనాడులో విజయ్ దేవరకొండ ‘ఖుషి’ ప్రమోషన్స్‌.. ఈసారి పాన్ ఇండియా హిట్ కొట్టాల్సిందే..

లైగర్ సినిమాతో పాన్ ఇండియా మార్కెట్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వాలని చూసిన విజయ్ దేవరకొండ కలల పై ఆ సినిమా రిజల్ట్ నీళ్లు చల్లింది. దీంతో ఇప్పుడు 'ఖుషి' సినిమాతో..

Kushi : తమిళనాడులో విజయ్ దేవరకొండ ‘ఖుషి’ ప్రమోషన్స్‌.. ఈసారి పాన్ ఇండియా హిట్ కొట్టాల్సిందే..

Vijay Deverakonda Samantha Kushi movie promotions in tamilnadu

Updated On : August 20, 2023 / 5:18 PM IST

Kushi : లవ్ స్టోరీస్ స్పెషలిస్ట్ శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), సమంత (Samantha) హీరోహీరోయిన్లుగా చేస్తున్న సినిమా ‘ఖుషి’. సెప్టెంబర్ 1న పాన్ ఇండియా లెవెల్ లో ఈ మూవీ రిలీజ్ అవ్వడానికి సిద్దమవుతుంది. ఇప్పటికే ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా సాంగ్స్ అండ్ ట్రైలర్ ని తెలుగుతో పాటు అన్ని భాషల్లో విడుదల చేసుకుంటూ వచ్చారు. రిలీజ్ అయిన ప్రతి సాంగ్ సూపర్ హిట్ అవ్వడంతో ఇటీవల తెలుగులో మ్యూజికల్‌ కాన్సర్ట్ ఏర్పాటు చేసి గ్రాండ్ గా నిర్వహించారు.

Varun Tej : లావణ్యతో ప్రేమ విషయం చివరివరకు సీక్రెట్‌గా ఉంచడానికి రీజన్ తెలిపిన వరుణ్.. ఎందుకో తెలుసా..?

కాగా లైగర్ సినిమాతో పాన్ ఇండియా మార్కెట్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వాలని చూసిన విజయ్ దేవరకొండ కలల పై ఆ సినిమా రిజల్ట్ నీళ్లు చల్లింది. దీంతో ఇప్పుడు ‘ఖుషి’ సినిమాతో ఆ ఆశని నెరవేర్చుకోవాలని చూస్తున్నాడు. ఈక్రమంలోనే కేవలం తెలుగులో మాత్రమే ప్రమోషనల్ ఈవెంట్స్ నిర్వహించడం కాకుండా, ఇతర భాషల్లో కూడా ఇంటర్వ్యూలతో పాటు ప్రమోషనల్ ఈవెంట్స్ కూడా చేయాలనీ నిర్ణయించుకున్నాడు. దీంతో రేపు ఆగష్టు 21న తమిళనాడులో రెండు ఈవెంట్స్ లో పాల్గొనున్నాడు విజయ్.

Kushi : ఖుషి ప్రమోషన్స్‌కి సమంత గుడ్ బై చెప్పేసిందా..? కారణం అదేనట..!

రేపు ఉదయం కోయంబత్తూరులోని ఒక కాలేజీలో స్టూడెంట్స్ తో ఇంటరాక్ట్ అవ్వనున్నాడు. ఆ తరువాత ఈవెనింగ్ చెన్నైలో ఒక ప్రెస్ మీట్ లో పాల్గొనున్నాడు. విజయ్ తో పాటు చిత్ర యూనిట్ కూడా ఈ ఈవెంట్స్ కి హాజరుకాకున్నారు. అయితే సమంత మాత్రం ఈ ప్రమోషన్స్ లో కనబడకపోవచ్చు. విజయ్ మాత్రం పాన్ ఇండియా సక్సెస్ కోసం చాలా గట్టిగానే ట్రై చేస్తున్నాడు. కాగా ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ హేశం అబ్దుల్ వహాబ్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు.