Bigg Boss 15: సల్మాన్ 14వారాల రెమ్యూనరేషన్ రూ.350కోట్లా..

హిందీ బిగ్ బాస్ అంటే గుర్తొచ్చేది సల్మాన్ ఖాన్ మాత్రమే. సీజన్ల వారీగా కంటెస్టెంట్లు మారుతున్నా హోస్ట్ మాత్రం ఫిక్స్ అన్నట్లు గుర్తుండిపోయారు. 11సీజన్ల నుంచి హోస్ట్ గా..

10TV Telugu News

Bigg Boss 15: హిందీ బిగ్ బాస్ అంటే గుర్తొచ్చేది సల్మాన్ ఖాన్ మాత్రమే. సీజన్ల వారీగా కంటెస్టెంట్లు మారుతున్నా హోస్ట్ మాత్రం ఫిక్స్ అన్నట్లు గుర్తుండిపోయారు. 11సీజన్ల నుంచి హోస్ట్ గా వ్యవహరిస్తున్న సల్మాన్.. ప్రతి సీజన్ ను పాపులార్ చేయడంలో యూనిక్ స్టైల్ వాడుతుంటారు.

ఈ రియాలిటీ షోకు సల్మాన్ తీసుకున్నంత ఎక్కువ అమౌంట్ మరెవ్వరూ తీసుకోవడం లేదట. బిగ్ బాస్ సీజన్ 14కు ఆయన తీసుకున్న రెమ్యూనరేషన్ సీజన్ 4 నుంచి సీజన్ 6వరకూ ఎపిసోడ్ కు రూ.2.5కోట్లు అని సమాచారం. సీజన్ 7నుంచి దానిని డబుల్ చేస్తూ.. ఎపిసోడ్ రూ.5కోట్లు వసూలు చేయడంతో వారానికి రూ.13కోట్లు వసూలు చేస్తున్నారట.

ఇక ఈ సీజన్ మొత్తానికి 14వారాలకు రూ.350కోట్లు తీసుకోనున్నాడట సల్మాన్. అంటే వారానికి రూ.25కోట్లు.

ఇండియన్ టెలివిజన్ హిస్టరీలో బిగ్ బాస్ అనేది ఒక బిగ్గెస్ట్ రియాలిటీ షో. ప్రతి సంవత్సరం కొత్త సెలబ్రిటీలను తీసుకొచ్చి రియాలిటీ షోతో అటెన్షన్ గ్రాబ్ చేస్తుంటారు. ఈ సారి సీజన్ ను మరింత ముస్తాబు చేసి దాదాపు ఆరు నెలల పాటు ప్రసారం చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఏదో ఒక వైల్డ్ కార్ట్ కంటెస్టెంట్ ను హౌజ్ లోకి తీసుకొచ్చి ఇంటరస్ట్ పెంచాలని మేనేజ్మెంట్ ప్లాన్ చేస్తుంది.

 

Read Also: : కేంద్ర మంత్రిపై చేయి చేసుకున్న సెక్యూరిటీ గార్డు