Bigg Boss 7 : అమర్ ఎంత పెద్ద సమస్యలో ఇరుక్కున్నాడో తెలుసా..?
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7లో ఏడవ వారం చివరికి వచ్చేసింది. వీకెండ్ ఎపిసోడ్‌కు అంతా సిద్ధమైంది. శనివారం ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రొమో విడుదలైంది.

Bigg BossTelugu 7 Day 48 Promo
Bigg Boss 7 Telugu : బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7లో ఏడవ వారం చివరికి వచ్చేసింది. వీకెండ్ ఎపిసోడ్‌కు అంతా సిద్ధమైంది. శనివారం ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రొమో విడుదలైంది. ఈ వారం నామినేషన్ల సందర్భంగా కంటెస్టెంట్లు ప్రవర్తించిన తీరుపై నాగార్జున మండిపడ్డాడు. కుండ బద్దలు కొట్టి చెప్పాలంటూ ప్రారంభించిన నాగార్జున.. అశ్విని కుండ బద్దలు కొట్టాడు. ఎందుకు చేశావమ్మా అని అడుగగా నేనే ఏం చేశాను సార్ అంటూ అశ్విని తెల్లముఖం వేసింది.
నువ్వు ఏం చేశావో నీకు తెలియదా..? ఒక్కొసారి నువ్వు రేయ్, పోరా అని అంటావ్ అని నాగార్జున చెప్పగానే అశ్విని ప్యూజులు ఔట్ అయిపోయాయి. అనంతరం బోలే కుండ పగులగొట్టిన నాగార్జున.. ఎర్రగడ్డ అనే పదం ఎందుకు వచ్చిందో చెప్పు అని అడిగాడు. శోభాశెట్టి సెన్స్ లేదు అని అనడంతో తాను అలా అన్నానని బోలే చెప్పాడు. సెన్స్‌లెస్‌కు మెంటల్‌కు చాలా తేడా ఉంటుంది ఆ మాత్రం తెలియదా అంటూ నాగార్జున మండిపడ్డాడు.
Tiger Nageswara Rao : ఆ విషయంలో వెనక్కి తగ్గిన టైగర్ నాగేశ్వరరావు.. ఆడియన్స్‌కి మరింత థ్రిల్..!
అమర్ కేక్ తిన్నప్పుడు నువ్వు బిగ్‌బాస్‌కు ఎందుకు ఫిర్యాదు చేయలేదు. ఏంటీ గ్రూపిజమా అంటూ శోభాశెట్టిని ప్రశ్నించాడు నాగ్. అంత ఆత్రంగా కేక్ తినడం అవసరమా..? నువ్వు చేసిన పని వల్ల ఎంత పెద్ద సమస్యలో ఇరుక్కున్నావో తెలుసా అంటూ అమర్‌ను ఉద్దేశించి నాగార్జున అన్నాడు. ఇక తేజా నీ నుంచి ఇది నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదని చెప్పాడు. సందీప్ ఒట్టు వేసినప్పుడు నువ్వు ఎందుకు వేయలేదు అంటూ ప్రశాంత్‌ను ప్రశ్నించాడు నాగ్.
ఇవన్నీ కాదోయ్.. అసలు ఊరోడు అనడం తప్పులేదని చెప్పాడు. అందరూ ఊరి నుంచే వచ్చారని, అందరికీ తిండి పెట్టేది ఊరేనన్నాడు. ‘నేను గర్వంగా చెబుతున్నాను మా నాన్న ఊరోడు.. సగర్వంగా చెబుతున్నాను. అందులో తప్పే లేదు .’అని నాగార్జున అన్నాడు.