Tiger Nageswara Rao : ఆ విషయంలో వెనక్కి తగ్గిన టైగర్ నాగేశ్వరరావు.. ఆడియన్స్‌కి మరింత థ్రిల్..!

హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్, అదిరిపోయే ఎలివేషన్స్ తో మాస్ ఆడియన్స్ కి మంచి కిక్‌ అందిస్తున్న టైగర్ నాగేశ్వరరావు.. నిడివి చాలా ఎక్కువ అయ్యిందనే టాక్ వినిపిస్తుంది. ఈ క్రమంలోనే..

Tiger Nageswara Rao : ఆ విషయంలో వెనక్కి తగ్గిన టైగర్ నాగేశ్వరరావు.. ఆడియన్స్‌కి మరింత థ్రిల్..!

Raviteja Tiger Nageswara Rao movie run time is reduced

Updated On : October 21, 2023 / 6:57 PM IST

Tiger Nageswara Rao : మాస్‌ మహారాజ రవితేజ న‌టించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా మూవీ ‘టైగర్‌ నాగేశ్వరరావు’ ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. వంశీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమా స్టువర్టుపురం దొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా రూపుదిద్దుకుంది. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ నిర్మించిన ఈ సినిమాలో నుపుర్‌ సనన్‌, గాయత్రి భరద్వాజ్ లు హీరోయిన్లుగా రేణు దేశాయ్‌, అనుపమ్‌ ఖేర్, మురళీ శర్మ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఈ వారం అక్టోబ‌ర్ 20న ఈ సినిమా పాన్ ఇండియా ఆడియన్స్ ముందుకు వ‌చ్చింది.

ట్రైలర్ అండ్ టీజర్స్ తో మంచి బజ్ ని క్రియేట్ చేసుకున్న ఈ మూవీ థియేటర్స్ లో మంచి టాక్ నే సొంతం చేసుకుంది. హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్, అదిరిపోయే ఎలివేషన్స్ తో మాస్ ఆడియన్స్ కి మంచి కిక్‌నే అందజేస్తుంది. అయితే ఈ మూవీ నిడివి చాలా ఎక్కువ అయ్యిందనే టాక్ వినిపిస్తుంది. ఈ క్రమంలోనే సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ అయ్యిందనే టాక్ వినిపిస్తుంది. అది కొంచెం తగ్గించి ఉంటే.. ఆడియన్స్ కి మరింత థ్రిల్ కలిగే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తుంది. ఇక టాక్ మూవీ టీం వరకు చేరుకుంది అనుకుంటా. నిడివి తగ్గిస్తూ కొత్త ప్రింట్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు.

Also read : PARVA : కాశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ మహాభారతం.. ‘పర్వ’ టైటిల్‌తో మూడు భాగాలుగా..

ఈ సినిమా ఫస్ట్ ప్రింట్ 3 గంటల ఒక నిమిషంతో ఆడియన్స్ ముందుకు వచ్చింది. దీని గురించి ముందు నుంచి ప్రశ్నలు ఎదురవుతున్నా.. చిత్ర యూనిట్ మాత్రం ఆ నిడివి అవసరం అంటూ చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు వెనక్కి తగ్గి 2 గంటల 37 నిమిషాల నిడివితో టైగర్ నాగేశ్వరరావుని ఆడియన్స్ ముందుకు తీసుకు వస్తున్నారు. దాదాపు 24 నిమిషాల సీన్స్ ని కట్ చేసి కొత్త ప్రింట్ ని రిలీజ్ చేశారు. మరి ఈ అవుట్ ఫుట్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటుందా..? లేదా..? చూడాలి.