PARVA : కాశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ మహాభారతం.. ‘పర్వ’ టైటిల్‌తో మూడు భాగాలుగా..
కాశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి.. మహాభారతం ఆధారంగా తన తదుపరి సినిమాని అనౌన్స్ చేశాడు.

Vivek Agnihotri announced his next movie Parva
PARVA : తాశ్కెంట్ ఫైల్స్, కశ్మీర్ ఫైల్స్ వంటి సినిమాలతో మంచి గుర్తింపుని సంపాదించుకున్న బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి.. ఇటీవల ‘ది వ్యాక్సిన్ వార్’ మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా మునపటి చిత్రాలు మాదిరి ఆకట్టుకోలేకపోయింది. అయితే ఈ మూవీ స్క్రిప్ట్ ఆస్కార్ లైబ్రరీలో శాశ్వత స్థానం దక్కిందుకొని సంచలనం సృష్టించింది. ఇది ఇలా ఉంటే.. ఈ దర్శకుడు తాజాగా తన సినిమా అప్డేట్ ని ఇచ్చాడు. మహాభారతం ఆధారంగా తన తదుపరి సినిమాని అనౌన్స్ చేశాడు.
ఈ చిత్రానికి ‘పర్వ’ అనే టైటిల్ ని ఫిక్స్ చేశాడు. ‘ధర్మానికి సంబంధించిన ఓ పురాణకథ’ అనే ట్యాగ్ లైన్ కూడా పెట్టాడు. కన్నడ రచయిత ఎన్.ఎల్.బైరప్ప రచించిన ‘పర్వ’ అనే పుస్తకం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కబోతుంది. మహాభారత కథతో వస్తున్న ఈ మూవీ మొత్తం మూడు భాగాలుగా తెరకెక్కిస్తున్నట్లు వివేక్ అగ్నిహోత్రి వెల్లడించాడు. అంతేకాదు కాన్సెప్ట్ వీడియో, పోస్టర్ కూడా రిలీజ్ చేశాడు. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే తెలియజేస్తాను అంటూ వివేక్ అగ్నిహోత్రి ట్విట్టర్ లో తెలియజేశాడు.
Also read : Sharathulu Vartisthai : మధ్య తరగతి కుటుంబాలకి ‘షరతులు వర్తిస్తాయి’..!
What is PARVA? Watch. pic.twitter.com/E91Zo1PLbB
— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) October 21, 2023
ఇప్పటి వరకు దేశంలో జరిగిన కొన్ని సంఘటనలు ఆధారంగా సినిమాలు తెరకెక్కించిన ఈ దర్శకుడు.. ఇప్పుడు భారతదేశంలోని అతిపెద్ద ఇతిహాసం అయిన మహాభారతాన్ని తెరకెక్కిస్తున్నాను అంటూ ప్రకటించడం సంచలనంగా మారింది. కాగా బాలీవుడ్ లోనే పలువురు దర్శకుడు ఈ మహాభారతం ఆధారంగా సినిమాలు తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నారు. ఈక్రమంలోనే రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా తమిళ్ హీరో సూర్యతో ‘కర్ణ’ సినిమా తెరకెక్కించే ప్లాన్ లో ఉన్నట్లు సమాచారం. ఇక ఇటు తమిళంలో హీరో విక్రమ్ ఆల్రెడీ ‘కర్ణ’ టైటిల్ తో మహాభారతం పై మూవీ మొదలు పెట్టేశాడు.