ఈ‘సారీ’.. బిగ్ బాస్-4 విన్నర్ ఆమేనా? అతడా?

ఈ‘సారీ’.. బిగ్ బాస్-4 విన్నర్ ఆమేనా? అతడా?

Biggboss 4 Finals – Biggboss Winner Trophy : వరల్డ్ బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 4 సీజన్ మెగా ఫైనల్‌కు చేరుకుంది. ఆదివారం (డిసెంబర్ 20) ఫైనల్ షోలో విన్నర్ ఎవరో తేలిపోనుంది. ఎవరా విన్నర్ అనే సస్పెన్స్‌కు ఈ రోజు తెరపడనుంది. గత మూడు సీజన్ల మాదిరిగానే ఈసారి కూడా బిగ్ బాస్ విజేతగా నిలిచేది అబ్బాయిలేనా? అంటే.. ఈసారికైనా అమ్మాయిలకు చాన్స్ ఇవ్వాలని అంటున్నారు. ఫైనల్ కు చేరిన ఐదుగురు కంటెస్టుంట్లలో ముగ్గురు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. ఈ నాలుగో సీజన్‌.. మూడు సీజన్లలో అబ్బాయిలే ట్రోఫీ తన్నుకుపోయారు. ఈసారైనా అమ్మాయి విజేతగా నిలుస్తుందా? అరియానా, హారికలకు చాన్స్‌ వస్తుందా? అనేది సస్పెన్స్ గా మారింది.

100 రోజుల పాటు ప్రేక్షకులను అలరించిన బిగ్ బాస్ షో ఈరోజు ముగియనుంది. ఇంతకీ ఈ షోలో టైటిల్ విన్నర్ ఎవరు? రన్నరప్ ఎవరూ అనేది ఆసక్తికరంగా మారింది. ఇతర భాషల బిగ్ బాస్ షోలలో ఐదు మంది మహిళలే బిగ్ బాస్ ట్రోపీ గెలుచుకున్నారు. కానీ, తెలుగులో అబ్బాయిలకు మేం తక్కువేం కాదు అన్నంతగా ప్రతిభావంతంగా రాణించినా మహిళలకు గత మూడు సీజన్‌లలో టైటిల్‌ దక్కలేదు. టాప్ 2 కంటెస్టుంట్లలో చోటు దక్కినా ట్రోపీ మాత్రం దక్కలేదు.. రన్నరప్ గానే వెనుదిరగాల్సి వచ్చింది. మరి ఈసారైనా అమ్మాయిలకు దక్కుతుందా? లేదా ఈ రోజు తేలిపోనుంది.

ఓటింగ్‌ సరళిని బట్టి పరిశీలిస్తే.. బిగ్ బాస్ హౌస్‌లో అరియానా, హారికల గేమ్ ఆడే విధానం ఆధారంగా ఈసారి బిగ్‌బాస్‌ టైటిల్‌ గెలిచేంత గట్టిగా లేరనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అరియానా ప్రవర్తనపరంగా ముక్కు సూటిగా ఉండటం ఆమెకు మైనస్‌ కావొచ్చునని విశ్లేషకులు అంటున్నారు. ఇక పురుష కంటెస్టెంట్‌ల్లో అభిజిత్, సొహైల్, అఖిల్‌ తమదైన శైలిలో ఆట తీరుతో ఓట్లను రాబట్టుకోగలిగారు. ఎవరు గెలిచినా బిగ్‌బాస్‌ 4 విజేతకు రూ.50 లక్షల ప్రైజ్‌మనీ సొంతం కానుంది.

ఈసారి మహిళలకు ట్రోఫీ దక్కుతుందా?:
ఈ 50 లక్షల కోసమే 100 రోజులుగా కంటెస్టెంట్లు అనేక టాస్కులను ఆడి ముందుకు సాగారు. హారికా, అరియానాలు అబ్బాయిలతో పోటీగా తట్టుకుని నిలబడ్డారు. హారికాకు సొహైల్‌కు మధ్య మాటల యుద్ధం నడిచింది. ఆ తర్వాత అరియానా సొహైల్‌కు మధ్య కూడా మాటల యుద్ధాలు జరిగాయి. హారికా అభిజిత్‌ ఒక గ్రూపులా ఉంటే.. సొహైల్‌– అఖిల్‌ ఒక గ్రూపుగా మారి అరియానాను ఒంటరిని చేశారు. హౌస్‌లో అరియానాకు అవినాష్ కు మంచి రిలేషన్ ఉంది. అవినాష్ ఎలిమినేట్ కావడంతో కాస్తా ఒంటరిగా ఫీల్ అయినట్టుగా అనిపించింది అరియానా.

అయినప్పటికీ తన ధైర్యాన్ని కోల్పోకుండా ట్రోఫీని లక్ష్యంగా ముందుకు సాగింది. బయట ప్రేక్షకుల నుంచి కూడా అరియానా అభిమానులను సంపాదించుకుంది. విజేత అయ్యే ఏ లక్షణమూ అరియానాలో లేదని మోనల్‌ గజ్జర్‌ చెప్పి వెళ్లింది. కానీ, ప్రేక్షకుల తీర్పు ఈసారి అమ్మాయిలే గట్టిగా ఫిక్స్ అయితే మాత్రం ఓటింగ్ సరళి మాత్రం ఒక్కసారిగా అమ్మాయిల వైపు మారిపోనుంది. అదేగాని జరిగితే ఈసారి బిగ్ బాస్ ట్రోఫీ మహిళా విజేతగా నిలవడం ఖాయం.. అమ్మాయిల్లో ఇద్దరిలో హరిక, అరియానాలో ఒకరికి ట్రోఫీ దక్కొచ్చు. ఎక్కువ ఛాన్స్ మాత్రం అరియానాకు ఉన్నాయని అంటున్నారు.

ఒకవేళ ఈసారి కూడా అబ్బాయిలదే బిగ్ బాస్ ట్రోఫీ అయితే.. ప్రేక్షకుల అంచనాల ప్రకారం.. అభిజిత్, సోహెల్, అఖిల్ ముగ్గురిలో ఎక్కువ ఛాన్స్ మాత్రం అభిజిత్ కు ఉందని అభిప్రాయపడుతున్నారు. రెండో స్థానంలో సోహెల్, ఆ తర్వాత అఖిల్, అమ్మాయిల్లో హరియానా 4, హారిక 5 స్థానంలో ఉందని టాక్ నడుస్తోంది. ఎలిమినేషన్ ప్రక్రియలో ముగ్గురు ఎలిమినేట్ అయితే చివరి మిగిలే ఇద్దరిలో ఎవరు ఉంటారు? ఒక అమ్మాయి? ఒక అబ్బాయి అని ఎవరో ఒకరు ఉండొచ్చునని అంటున్నారు.

అన్ని అనుకున్నట్టుగా జరిగితే అది బిగ్ బాస్ షో ఎందుకు అవుతుందనే టాక్ కూడా ఉంది. ఏది ఏమైనా మా టీవీలో ప్రసారమయ్యే ఫైనల్స్‌లో బిగ్ బాస్ సీజన్ 4 విజేతను ప్రకటించనున్నారు. చీఫ్‌గెస్ట్‌గా చిరంజీవి వస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. గత సీజన్‌లో వెంకటేశ్‌ వచ్చారు. అంతకు ముందు సీజన్‌ చిరంజీవి వచ్చారు. మళ్లీ ఆయనే రావచ్చుననే టాక్ వినిపిస్తోంది. అబ్బాయిలా? అమ్మాయిలా? ఎవరికి ట్రోఫీ దక్కనుందో తెలియాలంటే ఈ రోజు ఆఖరి సీజన్ ఫైనల్ షోలో తేలిపోనుంది.