Mahesh Babu : బిల్‌గేట్స్ ఫాలో అవుతున్న ఒకేఒక్క ఇండియన్ సెలబ్రిటీ మహేష్.. మహేష్ పై ట్వీట్, పోస్ట్ చేసిన బిల్‌గేట్స్..

మహేష్ బిల్‌గేట్స్ ని కలిసి ఫోటో దిగి పోస్ట్ చేయడమే గొప్ప అనుకోని మహేష్ ఫ్యాన్స్ అంతా ఆనందిస్తూ ఆ ఫోటోని వైరల్ చేశారు. ఇప్పుడు ఏకంగా మహేష్ ఫ్యాన్స్ ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. ఎందుకంటే మహేశ్ చేసిన ట్వీట్ ని...........

Mahesh Babu : బిల్‌గేట్స్ ఫాలో అవుతున్న ఒకేఒక్క ఇండియన్ సెలబ్రిటీ మహేష్.. మహేష్ పై ట్వీట్, పోస్ట్ చేసిన బిల్‌గేట్స్..

Billgates

Bill Gates :  సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల సర్కారు వారి పాట సినిమాతో భారీ విజయం సాధించిన తర్వాత ఫ్యామిలీతో కలిసి ఫారెన్ టూర్ చెక్కేశాడు. తాజాగా మహేష్ న్యూయార్క్ లో ప్రపంచ కుబేరుడు, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ ని కలిసాడు. భార్య నమ్రతతో కలిసి బిల్‌గేట్స్ ని కలిసిన మహేష్, ఆయనతో కొంచెం సమయం గడిపారు. బిల్‌గేట్స్ తో కలిసి దిగిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసి.. ”బిల్‌గేట్స్ ని కలవడం చాలా ఆనందంగా ఉంది. ప్రపంచంలోని అత్యుత్తమ వ్యక్తుల్లో ఒకరు. మోటివేట్ చేసే వ్యక్తి, ఎంతో గౌరవమైన వ్యక్తిని కలిసినందుకు హ్యాపీగా ఉంది” అంటూ పోస్ట్ చేశారు.

అయితే మహేష్ బిల్‌గేట్స్ ని కలిసి ఫోటో దిగి పోస్ట్ చేయడమే గొప్ప అనుకోని మహేష్ ఫ్యాన్స్ అంతా ఆనందిస్తూ ఆ ఫోటోని వైరల్ చేశారు. ఇప్పుడు ఏకంగా మహేష్ ఫ్యాన్స్ ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. ఎందుకంటే మహేశ్ చేసిన ట్వీట్ ని బిల్‌గేట్స్ షేర్ చేస్తూ.. ”న్యూయార్క్ లో ఉండటం ఎల్లప్పుడూ సరదాగా ఉంటుంది. మిమ్మల్ని మరియు నమ్రతను కలవడం చాలా సంతోషంగా ఉంది” అని పోస్ట్ చేశారు. అంతేకాకుండా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో మహేష్ తో దిగిన ఫోటోని పోస్ట్ చేసి..”గొప్ప మనసులు, ఆలోచనలు ఒకేలా ఉంటాయి. మిమ్మల్ని, నమ్రతని కలవడం చాలా సంతోషంగా ఉంది” అని పోస్ట్ చేశారు.

Repeated combos : హీరోయిన్స్ ని రిపీట్ చేస్తున్న హీరోలు..

దీంతో మహేష్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. వీటికి తోడు బిల్‌గేట్స్ ఇన్‌స్టాగ్రామ్ లో మహేష్ బాబుని ఫాలో అవుతున్నారు. బిల్‌గేట్స్ ఫాలో అయ్యే ఒకే ఒక్క ఇండియన్ సెలబ్రిటీ మహేష్ బాబు మాత్రమే. దీంతో మహేష్ ఫ్యాన్స్ తెగ సంతోషిస్తున్నారు. బిల్‌గేట్స్ లాంటి ప్రపంచ కుబేరుడు మహేష్ ని ఫాలో అవ్వడం, మహేష్ గురించి ట్వీట్ చేయడం.. ఇవన్నీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మొత్తానికి మహేష్ ఈ సంఘటనతో మరో మెట్టు ఎక్కేశారు.