Bimbisara: పండగపూట షాకిచ్చిన బింబిసార.. ఇక వచ్చేది అప్పుడే!

నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన రీసెంట్ మూవీ ‘బింబిసార’ ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ అయ్యింది. ఈ సినిమాను పూర్తిగా ఫిక్షన్ కథతో, టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో చిత్ర యూనిట్ తెరకెక్కించారు. కాగా, ఓటీటీలో ఈ సినిమాను అక్టోబర్ 7న రిలీజ్ చేస్తారని అందరూ ఎదురుచూస్తుండగా, ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే డేట్ ను‌తాజాగా వెల్లడించారు.

Bimbisara: పండగపూట షాకిచ్చిన బింబిసార.. ఇక వచ్చేది అప్పుడే!

Bimbisara Changes Its OTT Release Date

Bimbisara: నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన రీసెంట్ మూవీ ‘బింబిసార’ ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ అయ్యింది. ఈ సినిమాను పూర్తిగా ఫిక్షన్ కథతో, టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో చిత్ర యూనిట్ తెరకెక్కించగా, కొత్త దర్శకుడు వశిష్ట్ ఈ సినిమాను రూపొందించిన తీరు అద్భుతంగా ఉండటంతో ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు ఆసక్తిని చూపారు.

Bimbisara: ఓటీటీలో బింబిసారుడి ఆగమనం.. జగత్ జజ్జరికా!

ఇక ఈ సినిమా కథాపరంగా కూడా ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ కావడంతో కళ్యాణ్ రామ్ తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ను అందుకున్నాడు. కాగా, ఈ సినిమా థియేట్రికల్ రన్ సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకుని ఓటీటీలో రిలీజ్‌కు రెడీ అయ్యింది. అయితే దసరా కానుకగా ఈ సినిమాను అక్టోబర్ 7న ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం జీ5లో స్ట్రీమింగ్ కానుందని ఇప్పటికే అనౌన్స్ కూడా చేశారు. కానీ, పండగపూట ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌పై నిర్వాహకులు ఓ షాకింగ్ నిర్ణయాన్ని వెల్లడించారు.

Bimbisara: బింబిసార ఓటీటీ రిలీజ్.. క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు

బింబిసార చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో ఈ సినిమాను అక్టోబర్ 21న స్ట్రీమింగ్ చేయనున్నట్లు జీ5 తాజాగా వెల్లడించింది. దీంతో ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా చూసిన అభిమానులు, నిరాశకు లోనయ్యారు. మరి పండగపూట ఇలా అభిమానులను నిరాశకు గురిచేసిన బింబిసార, అక్టోబర్ 21న ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్‌ను దక్కించుకుంటుందో చూడాలి.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.