Bimbisara: బింబిసార ఓటీటీ రిలీజ్.. క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు

నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన తాజా చిత్రం ‘బింబిసార’ గత శుక్రవారం రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే సక్సెస్‌ను సొంతం చేసుకుంది. తాజాగా ఈ మూవీ సక్సెస్ మీట్‌ను నిర్వహించింది బింబిసార చిత్ర టీమ్. ఈ సక్సెస్ మీట్‌లో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కూడా పాల్గొన్నారు.

Bimbisara: బింబిసార ఓటీటీ రిలీజ్.. క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు

Bimbisara: నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన తాజా చిత్రం ‘బింబిసార’ గత శుక్రవారం రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే సక్సెస్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమాకు తొలిరోజే పాజిటివ్ టాక్ రావడంతో ఈ సినిమాను చూసేందుకు ఆడియెన్స్ థియేటర్లకు క్యూ కట్టారు. ఇక ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ పర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో దర్శకుడు వశిష్ఠ తెరకెక్కించిన ఈ సినిమా కథ అత్యద్భుతంగా మలచడంతో ఈ సినిమా రిలీజ్ అయిన అన్ని చోట్లా హౌజ్‌ఫుల్ షోలతో సందడి చేస్తోంది.

Bimbisara: బింబిసార కళ్యాణ్ రామ్ కాదా.. మరెవరు?

ఇక ఈ సినిమా సక్సెస్‌ను చిత్ర టీమ్ కూడా ఎంజాయ్ చేస్తోంది. తాజాగా ఈ మూవీ సక్సెస్ మీట్‌ను నిర్వహించింది బింబిసార చిత్ర టీమ్. ఈ సక్సెస్ మీట్‌లో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కూడా పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఆయన ఈ సినిమాకు సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. బింబిసార, సీతా రామం చిత్రాలు టాలీవుడ్‌కు బూస్ట్‌ని ఇచ్చాయని.. ఈ సినిమాలతో టాలీవుడ్ ఇండస్ట్రీ తిరిగి సక్సెస్ బాట పట్టిందని ఆయన అన్నారు. ఇక బింబిసార చిత్ర నటీనటులు, టెక్నీషియన్స్ పడ్డ కష్టానికి, ప్రేక్షకులు మంచి రెస్పాన్స్‌ను ఇవ్వడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు.

Bimbisara: బింబిసార సక్సెస్.. నందమూరి ఫ్యాన్స్ హ్యాపీ!

కాగా, ఈ క్రమంలోనే బింబిసార చిత్ర ఓటీటీ రిలీజ్ విషయంలోనూ దిల్ రాజు క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా ఓటీటీలో 50 రోజుల తరువాతే స్ట్రీమింగ్ అవుతుందని, ఇప్పుడిప్పుడే ప్రేక్షకులు థియేటర్లకు తిరిగి వస్తున్నారని.. వారికి థియేటర్ ఎక్స్‌పీరియన్స్‌ను దూరం చేయడం ఇష్టం లేదని ఆయన తెలిపారు. బింబిసార టోటల్ థియేట్రికల్ రన్ తరువాతే ఓటీటీలో రిలీజ్ అవుతుందని ఆయన అన్నారు. మరి బింబిసార చిత్రం మున్ముందు ఇంకా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.