డిస్కోరాజాలో బర్మా సేతుగా బాబీ సింహా

నవంబర్ 6 బాబీ సింహా బర్త్‌డే సందర్భంగా విషెస్ తెలుపుతూ ‘డిస్కోరాజా’లో ఆయన లుక్ రిలీజ్ చేసింది మూవీ టీమ్.

  • Published By: sekhar ,Published On : November 6, 2019 / 11:00 AM IST
డిస్కోరాజాలో బర్మా సేతుగా బాబీ సింహా

నవంబర్ 6 బాబీ సింహా బర్త్‌డే సందర్భంగా విషెస్ తెలుపుతూ ‘డిస్కోరాజా’లో ఆయన లుక్ రిలీజ్ చేసింది మూవీ టీమ్.

మాస్ మహారాజా రవితేజ, వి.ఐ.ఆనంద్ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా.. ‘డిస్కోరాజా’.. సైన్స్ ఫిక్షన్ అండ్ పిరియాడిక్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో రవితేజ తండ్రీ, కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. నభా నటేశ్, పాయల్ రాజ్‌పుత్, తాన్యా హోప్ హీరోయిన్స్ కాగా ప్రముఖ తమిళ నటుడు బాబీ సింహా విలన్‌గా కనిపించనున్నాడు.

నవంబర్ 6 బాబీ సింహా బర్త్‌డే సందర్భంగా విషెస్ తెలుపుతూ ‘డిస్కోరాజా’లో ఆయన లుక్ రిలీజ్ చేసింది మూవీ టీమ్. ఈ సినిమాలో బాబీ సింహా ‘బర్మా సేతు’ అనే క్యారెక్టర్ చేస్తున్నాడు. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో తీక్షణమైన చూపుతో బాబీ లుక్ ఆకట్టుకుంటోంది.

Read Also : అనుష్క ‘నిశ్శబ్దం’ టీజర్ చూశారా!

ఆయన పాత్రలో పలు షేడ్స్ ఉంటాయని తెలుస్తోంది. ఎస్.ఆర్.టి. బ్యానర్‌పై రామ్ తాళ్ళూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు మ్యూజిక్ : థమన్, సినిమాటోగ్రాఫర్ : కార్తీక్ ఘట్టమనేని, ఎడిటింగ్ : నవీన్ నూలి, డైలాగ్స్ : అబ్బూరి రవి.