ఆజ్ రాత్ తుమ్ సిర్ఫ్ మేరే ఓ – ‘ది బాడీ’ : ట్రైలర్

ఇమ్రాన్ హష్మీ, రిషి కపూర్, శోభిత ధూలిపాల, వేదిక, ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్.. ‘ది బాడీ’థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్..

  • Published By: sekhar ,Published On : November 15, 2019 / 10:26 AM IST
ఆజ్ రాత్ తుమ్ సిర్ఫ్ మేరే ఓ – ‘ది బాడీ’ : ట్రైలర్

ఇమ్రాన్ హష్మీ, రిషి కపూర్, శోభిత ధూలిపాల, వేదిక, ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్.. ‘ది బాడీ’థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్..

ఇమ్రాన్ హష్మీ, రిషి కపూర్, శోభిత ధూలిపాల, వేదిక, ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్.. ‘ది బాడీ’.. వయాకామ్ 18 స్టూడియోస్ నిర్మిస్తోంది..  మలయాళం ‘దృశ్యం’తో ఆకట్టుకున్న జీతూ జోసెఫ్ ఈ సినిమా ద్వారా బాలీవుడ్‌కి పరిచయమవుతున్నారు.. శుక్రవారం ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేశారు.

మాయ వర్మ (శోభిత) అనుకోకుండా మర్డర్ కావడం, రిషి కపూర్ ఆమె కేసుని ఇన్వెస్టిగేట్ చేయడం, ఇమ్రాన్, వేదిక కలిసి మాయ వర్మను మర్డర్ చేశారనే డౌట్ ఆడియన్స్‌కు క్రియేట్ చేయడం.. ఇలా ఉత్కంఠ భరితంగా సాగిందీ ట్రైలర్.. నటీనటుల పర్ఫార్మెన్స్, విజువల్స్, ఆర్ఆర్ పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యాయి. ఇమ్రాన్ మార్క్ లిప్ లాక్‌లు సినిమాలో ఉండబోతున్నాయని ట్రైలర్‌లో హింట్ ఇచ్చారు.

కొంత విరామం తర్వాత రిషి కపూర్ నటిస్తున్న సినిమా ఇదే.. కేవలం 39 రోజుల్లో షూటింగ్ పూర్తి చేయడం విశేషం. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ఓ స్పానిష్ సినిమా ఆధారంగా తెరకెక్కుతుంది. డిసెంబర్ 13న ‘ది బాడీ’ థియేటర్స్‌లోకి రానుంది..