Arjun – Malaika : బాలీవుడ్ హాట్ కపుల్ బ్రేకప్ చెప్పుకున్నారా?

49 ఏళ్ల మలైకా.. 38 ఏళ్ల హీరో అర్జున్ కపూర్ ని ఇష్టపడింది. 50 ఏళ్లకు దగ్గరవుతున్న వయసులో తనకంటే 12 ఏళ్లు చిన్నవాడైన హీరోతో డేటింగ్ అవసరమా అంటూ కాంట్రవర్సీలు, ట్రోలింగ్ వచ్చినా అసలు పట్టించుకోలేదు.

Arjun – Malaika : బాలీవుడ్ హాట్ కపుల్ బ్రేకప్ చెప్పుకున్నారా?

Bollywood Famous couple Malaika Arora Arjun Kapoor Love Breakup Rumors goes Viral

Updated On : August 26, 2023 / 1:59 PM IST

Arjun – Malaika : బాలీవుడ్(Bollywood) హాట్ లవ్ బర్డ్స్ మలైకా అరోరా(Malaika Arora), అర్జున్ కపూర్(Arjun Kapoor) 4 ఏళ్ల నుంచి డేటింగ్ లో ఉన్నారు. అదిగో పెళ్లి ..ఇదిగో పెళ్లి అంటూ లాస్ట్ ఇయర్ నుంచి చెబుతున్న ఈ జంట బ్రేకప్ చెప్పుకున్నారని టాక్ నడుస్తోంది. ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్ అని ప్రూవ్ చేసిన బాలీవుడ్ హాట్ కపుల్ అర్జున్ కపూర్, మలైకా అరోరా. ఈ ఇద్దరి మధ్యా ఏజ్ గ్యాప్.. 12 ఏళ్లు.

సల్మాన్ తమ్ముడు ఆర్బాజ్ తో విడాకులు తీసుకున్నాక 49 ఏళ్ల మలైకా.. 38 ఏళ్ల హీరో అర్జున్ కపూర్ ని ఇష్టపడింది. 50 ఏళ్లకు దగ్గరవుతున్న వయసులో తనకంటే 12 ఏళ్లు చిన్నవాడైన హీరోతో డేటింగ్ అవసరమా అంటూ కాంట్రవర్సీలు, ట్రోలింగ్ వచ్చినా అసలు పట్టించుకోలేదు. అయితే పీకల్లోతు ప్రేమలో మునిగితేలిన ఈ జంట ఇప్పుడు విడిపోయిందంటూ రూమర్స్ వైరలవుతున్నాయి.

4 ఏళ్ల నుంచి సీరియస్ రిలేషన్ లో ఉన్న మలైకా, అర్జున్ కపూర్ ఇద్దరూ విడిపోయినట్టుగా ప్రస్తుతం బాలీవుడ్ లో టాక్ నడుస్తోంది. ర్యాంప్ వాకింగ్స్ దగ్గరనుంచి రాత్రి డిన్నర్ల వరకూ అన్నటికీ కలిసి కనిపించే ఈ జంట ఇప్పుడు సైలెంట్ అయిపోయింది. ఎప్పుడూ మలైకాతో ట్రిప్స్ కి వెళ్లే అర్జున్ ఈ మధ్య ఒక్కడే వెకేషన్ కి వెళ్లడంతో అసలు ఇష్యూ స్టార్ట్ అయ్యినట్టు వార్తలొస్తున్నాయి. అక్కడి ఫోటోలతో పాటు పెట్టిన క్యాప్షన్స్ కూడా ఎక్కడో వీళ్ల రిలేషన్ బ్రేక్ అయ్యిందేమో అన్న డౌట్ క్రియేట్ చేస్తోంది.

Baby Movie : ఓటీటీలో కూడా బేబీ రికార్డ్.. ఒక్కరోజులోనే 100 మిలియన్ నిమిషాల వ్యూస్..

ఒక వైపు అర్జున్ కపూర్, మలైకా ఇద్దరి బ్రేకప్ రూమర్స్ నడుస్తున్నాయో లేదో, మరో వైపు .. అర్జున్ కపూర్ వేరే అమ్మాయితో రిలేషన్ స్టార్ట్ చేశాడంటూ వార్తలొచ్చేశాయి. యూట్యూబర్, ఇన్‌ఫ్లూయెన్సర్, యాక్టర్ అయిన కుషా కపిలతో రిలేషన్ లో ఉన్నాడని బాలీవుడ్ లో రూమర్స్ బాగా స్ప్రెడ్ అయిపోయాయి. ఈమధ్యే డివోర్స్ తీసుకున్న కుషా మాత్రం ఈ వార్తలు అబద్దమని తేల్చేసింది. అయితే అటు మలైకా కానీ, ఇటు అర్జున్ కానీ తమ బ్రేకప్ రూమర్స్ మీద మాత్రం రియాక్ట్ అవ్వడం లేదు. వీళ్లు రెస్పాండ్ అయితే కానీ అసలు విషయం తెలియదని వెయిట్ చేస్తున్నారు బాలీవుడ్ జనాలు.