Brandy Diaries : యూత్‌కి మంచి కిక్ ఇచ్చే ‘బ్రాందీ డైరీస్’..

యూత్ ఆడియెన్స్‌ను టార్గెట్ చేసుకుని, నూతన నటీనటులతో తెరకెక్కించిన ఫన్ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్.. ‘బ్రాందీ డైరీస్’..

Brandy Diaries : యూత్‌కి మంచి కిక్ ఇచ్చే  ‘బ్రాందీ డైరీస్’..

Brandy Diaries Review

Brandy Diaries: కంటెంట్ బాగుంటే కొత్త, పాత అనే తేడా లేకుండా ఆదరించడం మన తెలుగు ప్రేక్షకులకు అలవాటు. ఆ కోవలో యూత్ ఆడియెన్స్‌ను టార్గెట్ చేసుకుని, నూతన నటీనటులతో తెరకెక్కించిన ఫన్ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్.. ‘బ్రాందీ డైరీస్’.. పోస్టర్స్, ట్రైలర్స్ ఆకట్టుకోవడంతో సినిమా మీద మంచి హైప్ క్రియేట్ అయింది. కోవిడ్ సెకండ్ వేవ్ తరువాత ఆగస్టు 13 న ప్రేక్షకుల ముందుకు వచ్చిందీ మూవీ. మరి థియేటర్స్‌లో రిలీజ్ అయిన ‘బ్రాందీ డైరీస్’ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

కథ విషయానికొస్తే..
‘బ్రాందీ డైరీస్’ కొన్ని పాత్రల మధ్య సాగే కథ. శేఖర్, శ్రీను, వర్మ, జాన్సన్, కోటి.. వీళ్లు ఐదుగురు గ్లాస్ మేట్స్. శేఖర్ డిప్యూటీ ఎమ్మారోగా పనిచేస్తుంటాడు. శ్రీను సివిల్స్ ప్రిపేర్ అవుతుంటాడు. జాన్సన్ పనీ పాట లేకుండా గాలికి తిరుగుతుంటాడు. వర్మ ఓ జీనియస్. కోటి ఒక చెప్పుల కంపెనీలో పనిచేస్తుంటాడు. ఇలా వివిధ రంగాలకు చెందిన ఐదుగురు వ్యక్తులను మందు స్నేహితులను చేస్తుంది. తాగి వాళ్ల వాళ్ల కష్టాలను ఒకరికి ఒకరు చెప్పుకుంటారు. శేఖర్ అనే వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగి, కానీ పై అధికారులు తీరు అతనికి నచ్చదు.

గవర్నమెంట్ ఉద్యోగి అయి ఉండి సంపాదించలేకపోవడంతో ఇంటిలో భార్య పోరు పెడుతుంటుంది. వర్మ మిడిల్ ఏజ్ దాటి ఓల్డ్ ఏజ్‌కు దగ్గరవుతున్న బ్యాచ్‌లర్. ప్రేమ, పెళ్లి అనేవి అతనికి పడవు. బాగా చదువుకున్న వ్యక్తి. సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్న శ్రీను, కెరీర్‌లో స్థిరపడాలని ప్రయత్నిస్తుంటాడు. ఇలా ఐదు పాత్రలది ఐదు విభిన్న నేపథ్యం. ఈ ఐదు పాత్రల ద్వారా దర్శకుడు చెప్పిన ఫిలాసపీ, లైఫ్ జర్నీనే ‘బ్రాందీ డైరీస్’.. ఇందులో శ్రీనుది హీరో పాత్ర. అతను సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యే భవ్య అనే యువతిని ప్రేమిస్తాడు. మద్యపానం అలవాటు, అతని ప్రేమకు ఆటంకం అవుతుంది. మరి ఈ ఐదుగురు జీవితాలు మద్యం ప్రభావంతో ఎలాంటి మలుపులు తిరిగాయి అనేది మిగిలిన కథ.

Brandy Diaries

 

టెక్నిషియన్స్ విషయానికొస్తే..
ఐదు విభిన్న పాత్రల ద్వారా వారి జీవితాల్ని వివరించే ప్రయత్నం చేశాడు దర్శకుడు శివుడు. తాను రాసుకున్న కథను తన ఇమేజినేషన్‌కి తగ్గట్టు ఆ అయిదుగురు ప్రేమ, పెళ్లి, స్నేహం, కెరీర్ ఇలా కొన్ని అంశాలను మద్యం నేపథ్యంతో తెరకెక్కించాడు. ‘బ్రాందీ డైరీస్’ మనలో చాలా మంది జీవితాలకు అద్దం పడుతుంది. వాస్తవికంగా సినిమాను రూపొందించడంలో దర్శకుడు ఓకే అనిపించాడు. ఇక ప్రకాష్ అందించిన సంగీతం ఆకట్టుకుంది. పాటలు, నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్ అయ్యాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు కథకు తగినట్లు బాగున్నాయి.

నటీనటుల విషయానికొస్తే..
మెయిన్ లీడ్స్ అయిన సునీత సద్గురు, నవీన్ వర్మ, కెవి శ్రీనివాస్, రవీంద్ర బాబు, దినేష్ మాడ్నె తమ పాత్రల పరిధి మేర నటించి ఆకట్టుకున్నారు.
వర్మ పాత్ర ద్వారా చాలా ఫిలాసఫీ చెప్పించాడు దర్శకుడు. శ్రీను, భవ్య మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్ యూత్‌కు కనెక్ట్ అవుతాయి. కుటంబాన్ని పట్టించుకుకోని జాన్సన్ లాంటి పాత్రలను మనం ఎన్నో చూసి ఉంటాం. తన ఉద్యోగ ధర్మంగా పేదలకు సాయం చేయాలని చూసే డిప్యూటీ ఎమ్మార్వో శేఖర్ పాత్ర కూడా బాగుంది. భవ్య పాత్రలో సునీత ఆకట్టుకుంది. ఆమె స్మైల్, హావభావాలు మెప్పించాయి.

ఓవరాల్‌గా చెప్పాలి అంటే…
యూత్‌కి మంచి కిక్ ఇచ్చే సినిమా ‘బ్రాందీ డైరీస్’..
నటీనటులు – సునీత సద్గురు, నవీన్ వర్మ, కెవి శ్రీనివాస్, రవీంద్ర బాబు, దినేష్ మాడ్నె..

సాంకేతిక నిపుణులు – సినిమాటోగ్రఫీ : ఈశ్వరన్ తంగవేల్, ఎడిటర్ : యోగ శ్రీనివాస్, సంగీతం : ప్రకాష్ రెక్స్, బ్యానర్ : కలెక్టివ్ డ్రీమర్స్, నిర్మాత : లెల్ల శ్రీకాంత్, రచన – దర్శకత్వం : శివుడు..