‘బుట్ట బొమ్మ’ మరో కొత్త రికార్డ్.. బన్నీకి విషెస్ తెలిపిన వార్నర్..

  • Published By: sekhar ,Published On : November 24, 2020 / 04:25 PM IST
‘బుట్ట బొమ్మ’ మరో కొత్త రికార్డ్.. బన్నీకి విషెస్ తెలిపిన వార్నర్..

Butta Bomma Song: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, హాట్ బ్యూటీ పూజా హెగ్డే జంటగా త్రివిక్రమ్ తెరకెక్కించిన 2020 సంక్రాంతి బ్లాక్‌బస్టర్ ‘అల వైకుంఠపురములో..’ మూవీలోని ‘బుట్ట బొమ్మా.. బుట్ట బొమ్మా’.. సాంగ్ ఎంత పాపులర్ అయిందో తెలిసిందే.


ఇప్పటికే ఎన్నో రికార్డులు సృష్టించిన ఈ పాట తాజాగా మరో అరుదైన రికార్డ్ సాధించింది. యూట్యూబ్లో ఈ పాటకు 450 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఆస్ట్రేలియా ఆటగాడు, సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌ తన వైఫ్‌తో కలిసి ‘బుట్ట బొమ్మ’ పాటకు స్టెప్పులేశాడు.
https://10tv.in/tollywood-assistant-director-missing/

 

View this post on Instagram

 

A post shared by David Warner (@davidwarner31)

ఈ పాట కొత్త రికార్డ్ అందుకున్న సందర్భంగా వార్నర్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభినందించాడు. బుట్టబొమ్మ సాంగ్ పోస్టర్‌ను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ చేసి ‘వెల్‌డన్ అల్లు అర్జున్’ అని కామెంట్ చేశాడు.


థమన్ కంపోజ్ చేసిన ఈ ‘బుట్ట బొమ్మ’ పాటకు ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు స్టెప్పులేసిన సంగతి తెలిసిందే. మలయాళంలోనూ సక్సెస్ అయింది ‘అల వైకుంఠపురములో..’David Warner