Yashoda: సమంత సినిమాకు నిజంగానే అంత ఖర్చయ్యిందా..?

టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత నటిస్తున్న తాజా చిత్రం ‘యశోద’ ఇప్పటికే అన్ని పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను నవంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ కావడంతో ఈ సినిమాను చూసేందుకు సామ్ అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Yashoda: సమంత సినిమాకు నిజంగానే అంత ఖర్చయ్యిందా..?

Buzz On Samantha Yashoda Movie Budget

Yashoda: టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత నటిస్తున్న తాజా చిత్రం ‘యశోద’ ఇప్పటికే అన్ని పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను నవంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ కావడంతో ఈ సినిమాను చూసేందుకు సామ్ అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా, ఈ సినిమాను హరి-హరీశ్‌లు సంయుక్తంగా తెరకెక్కిస్తుండగా, సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా ఈ సినిమా రానుండటంతో ‘యశోద’ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆతృతగా చూస్తున్నారు.

Yashoda: యశోద సినిమాలో హైలైట్‌గా నిలవబోయే అంశాలు ఇవేనా..?

ఇక ఈ సినిమాకు సంబంధించి వరుసగా అప్డేట్స్ ఇస్తూ చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ పనుల్లో సామ్ ఎలా వర్క్ చేస్తుందో, ఆమె డెడికేషన్‌కు హ్యాట్సాఫ్ చెబుతూ చిత్ర యూనిట్ కొన్ని ఫోటోలను షేర్ చేసింది. కాగా, ఈ సినిమా రిలీజ్ సందడి అప్పుడే థియేటర్ల వద్ద మొదలైంది. హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో సామ్ భారీ కటౌట్‌కు సంబంధించిన ఫోటోలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే, ఈ సినిమాకు సంబంధించిన బడ్జెట్ విషయంలో చిత్ర నిర్మాత కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

Yashoda: యశోద రన్‌టైం ఎంతో తెలుసా.. సామ్‌కు ఇది కలిసొస్తుందా..?

ఈ సినిమాను నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ చాలా తక్కువ బడ్జెట్‌తో నిర్మించాలని భావించాడట. కానీ, సినిమా పూర్తయ్యే సరికి ఈ సినిమా ఖర్చు ఏకంగా రూ.40 కోట్లకు చేరుకున్నట్లుగా ఆయన వెల్లడించారు. దీంతో ఈ సినిమా అంత స్థాయిలో బిజినెస్ చేస్తుందా అని పలువురు అనుమానం వ్యక్తం చేశారు. కానీ, ఈ సినిమాకున్న క్రేజ్ కారణంగా డిజిటల్ రైట్స్, ఓవర్సీస్, తెలుగు స్టేట్స్ రైట్స్ రూపంలో ఇప్పటికే ఈ సినిమాకు దాదాపు రూ.30 కోట్ల మేర బిజినెస్ జరిగినట్లుగా చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఇక శాటిలైట్ రైట్స్‌తో పాటు హిందీ, కన్నడలో సొంత రిలీజ్ ఉండటంతో ఈ సినిమాకు మంచి లాభాలు దక్కే అవకాశం మెండుగా ఉన్నట్లుగా చిత్ర యూనిట్ చెబుతోంది. మరి ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌ను సాధిస్తుందా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.