Yashoda: యశోద రన్‌టైం ఎంతో తెలుసా.. సామ్‌కు ఇది కలిసొస్తుందా..?

టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత లీడ్ రోల్‌లో నటిస్తున్న సస్సెన్స్ థ్రిల్లర్ మూవీ ‘యశోద’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యింది. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్, ట్రైలర్లు ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేశాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన రన్‌టైం గురించి సోషల్ మీడియాలో ఓ వార్త తెగ చక్కర్లు కొడుతోంది.

Yashoda: యశోద రన్‌టైం ఎంతో తెలుసా.. సామ్‌కు ఇది కలిసొస్తుందా..?

Yashoda Movie Runtime Locked

Yashoda: టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత లీడ్ రోల్‌లో నటిస్తున్న సస్సెన్స్ థ్రిల్లర్ మూవీ ‘యశోద’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యింది. ఈ సినిమాను హరి, హరీశ్‌లు కలిసి డైరెక్ట్ చేస్తుండగా, ఈ సినిమాలో ఓ ప్రెగ్నెంట్ లేడీగా సామ్ పర్ఫార్మెన్స్ మరో లెవెల్‌లో ఉండబోతున్నట్లుగా చిత్ర యూనిట్ చెబుతోంది. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్, ట్రైలర్లు ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేశాయి.

Yashoda: సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న యశోద..

దీంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్‌ను జారీ చేయగా, తాజాగా ఈ సినిమాకు సంబంధించిన రన్‌టైం గురించి సోషల్ మీడియాలో ఓ వార్త తెగ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాకు 135 నిమిషాల రెగ్యులర్ రన్‌టైం‌ను చిత్ర యూనిట్ లాక్ చేసినట్లుగా తెలుస్తోంది. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలకు ఈ రన్‌టైం చాలా పర్ఫెక్ట్‌గా ఉంటుందని పలువురు సినీ ఎక్స్‌పర్ట్స్ కామెంట్ చేస్తున్నారు.

Yashoda: “యశోద” అంటే ఎవరో తెలుసుగా.. కృష్ణ పరమాత్ముడు తల్లి.. ట్రైలర్ లో యాక్షన్ సీన్స్ అదరగొట్టిన సమంత..

ఇక ఈ సినిమాలో సామ్ పాత్ర ప్రేక్షకులను కట్టిపడేయడం ఖాయమని చిత్ర యూనిట్ అంటోంది. అంతేగాక, ఈ సినిమాలో ఆమె చేసే యాక్షన్ సీక్వెన్స్‌లు కూడా అభిమాలను ఆకట్టుకుంటాయని వారు అంటున్నారు. ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్, రావు రమేశ్, మురళీ శర్మ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తుండగా, ఈ చిత్రాన్ని నవంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.