ఎల్లలు దాటిన అభిమానం.. తారక్ పాటకు జపాన్ ఫ్యాన్స్ స్టెప్స్

  • Published By: sekhar ,Published On : July 4, 2020 / 04:46 PM IST
ఎల్లలు దాటిన అభిమానం.. తారక్ పాటకు జపాన్ ఫ్యాన్స్ స్టెప్స్

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు ఏ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో కొత్తగా చెప్పనవసరం లేదు. మాస్, క్లాస్ అనే తేడా లేకుండా అందరూ అభిమానిస్తుంటారనే సంగతి తెలిసిందే. తారక్ డైలాగ్స్, డ్యాన్సింగ్ స్కిల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటివరకు ఫ్యాన్స్ ఎన్టీఆర్ డైలాగులు చెప్పడం, పాటలకు డ్యాన్స్ వేయడం చూశాం. తాజాగా జపాన్ కు చెందిన తారక్ అభిమానులు చేసిన డ్యాన్సింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

తారక్ నటించిన ‘అశోక్’ సినిమాలోని గోలా గోలా రంగోలా అనే పాటకు ఓ యువతి, యువకుడు బ్యూటిఫుల్ మూమెంట్స్ వేశారు. అచ్చు తారక్, సమీరా రెడ్డిలా కాస్ట్యూమ్స్ వేసుకుని అంతే ఎనర్జిటిక్‌గా డ్యాన్స్ చేశారు. HIROMUNIERU పేరుతో వీడియోను ట్విట్టర్లో షేర్ చేశారు. ఇదే పేరుతో ఉన్న యూట్యూబ్ ఛానెల్‌లో కూడా వీడియో అప్‌లోడ్ చేశారు. తారక్ అభిమానులు ఈ వీడియోను పలు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తున్నారు.

Read:పంద్రాగష్టుకు ‘మైదాన్’