Chiranjeevi : ఎన్టీఆర్,సావిత్రి ఎలాగో నేను, నయనతార కూడా అంతే.. అందుకే ఇలా..
ఈ సినిమాలో నయనతార చిరంజీవికి చెల్లెలిగా నటించింది. నయనతార కూడా చాలా అద్భుతంగా నటించింది. పూరి జగన్నాధ్ నయనతార గురించి అడగగా చిరంజీవి మాట్లాడుతూ................

Chiranjeevi about nayatara character in God Father comparing ntr savitri rakthasambandham movie
Chiranjeevi : చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా ఇటీవల దసరాకి రిలీజ్ అయి భారీ విజయం సాధించింది. చిరంజీవికి గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చింది ఈ సినిమా. ఇప్పటికే 100 కోట్ల గ్రాస్ కలెక్షన్లని కూడా దాటింది ఈ సినిమా. చిరంజీవి చాలా రోజుల తర్వాత ఇంతటి భారీ విజయం సాధించడంతో ఫుల్ జోష్ లో ఉన్నారు. వరుసగా సక్సెస్ ఇంటర్వూస్ ఇస్తున్నారు. తాజాగా చిరంజీవితో పూరి జగన్నాధ్ ఇన్‌స్టాగ్రామ్ లైవ్ ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో పూరి పలు ప్రశ్నలు అడగగా చిరంజీవి వాటికి సమాధానాలిచ్చారు.
ఈ సినిమాలో నయనతార చిరంజీవికి చెల్లెలిగా నటించింది. నయనతార కూడా చాలా అద్భుతంగా నటించింది. పూరి జగన్నాధ్ నయనతార గురించి అడగగా చిరంజీవి మాట్లాడుతూ.. ”డైరెక్టర్ మోహన్ రాజానే నయనతారని తీసుకుందాం అన్నాడు. నేను ఓకే చెప్పాను. మోహన్ అప్పటికే నయనతారతో రెండు సినిమాలు చేశాడు, కథ చెప్పి ఒప్పించాడు. చాలా చక్కగా చేసింది. క్లైమాక్స్ రీ షూట్ చేసినప్పుడు అడగ్గానే మళ్ళీ వచ్చింది.”
Chiranjeevi : సల్మాన్ పాత్రకి మొదట పవన్ కళ్యాణ్ ని అనుకున్నాం.. కానీ..
”అంతకు ముందే మేమిద్దరం సైరాలో కలిసి చేశాము. అయితే ఆ సినిమాలో భార్య భర్తల్లా నటించాము. షూట్ స్టార్ట్ అయ్యాక కొంతమంది నాతో సైరా రీసెంట్ గానే వచ్చింది అందులో ఏమో భార్య భర్తల్లా చేసి ఇప్పుడేమో అన్నా చెల్లెల్లుగా చేస్తే బాగోదేమో అన్నారు. నేను వాళ్లకి ఒకటే ఉదాహరణ చెప్పాను. ఎన్టీఆర్, సావిత్రి స్టార్ హీరో, హీరోయిన్స్ గా కలిసి చేస్తున్న టైములోనే అన్నాచెల్లెళ్లుగా రక్త సంబంధం సినిమా చేశారు. ఆ సినిమా పెద్ద విజయం సాధించింది. ఇది కూడా అంతే. కథని బట్టే పాత్రలు ఉంటాయి. సినిమా రిలీజ్ అయ్యాక నయనతార ఆ పాత్రకి సరిగ్గా సరిపోయిందని అందరూ అంటున్నారు” అని తెలిపారు.