Cobra Movie: చియాన్ విక్రమ్ ‘కోబ్రా’కు కోతపెట్టిన చిత్ర యూనిట్!

తమిళ స్టార్ యాక్టర్ చియాన్ విక్రమ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘కోబ్రా’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి బజ్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు తెరకెక్కించగా, పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ సినిమాను రూపొందించారు. కాగా, ఆగస్టు 31న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.

Cobra Movie: చియాన్ విక్రమ్ ‘కోబ్రా’కు కోతపెట్టిన చిత్ర యూనిట్!

Cobra Movie Trimmed By 20 Minutes

Cobra Movie: తమిళ స్టార్ యాక్టర్ చియాన్ విక్రమ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘కోబ్రా’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి బజ్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు తెరకెక్కించగా, పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ సినిమాను రూపొందించారు. కాగా, ఆగస్టు 31న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.

Cobra Movie: కోబ్రా ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే?

కాగా, ఈ సినిమాలో విక్రమ్ విభిన్న గెటప్స్‌లో కనిపించి ప్రేక్షకులను థ్రిల్ చేశాడు. ఇక ఆయన పర్ఫార్మెన్స్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అయితే, ఈ సినిమాను చూసిన చాలా మంది, ఈ చిత్ర రన్‌టైమ్ విషయంలో పలు సూచనలు చేస్తూ వచ్చారు. ఈ సినిమాకు లెంగ్తీ రన్ టైమ్ ఉండటం ప్రేక్షకులను ఇబ్బంది పెడుతుందని వారు చెప్పడంతో, చిత్ర యూనిట్ తాజాగా ఈ సినిమాకు కోతపెట్టారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అఫీషియల్‌గా అనౌన్స్ చేయడంతో ప్రస్తుతం ఇది హాట్ టాపిక్‌గా మారింది.

Cobra Movie Promotions : హైదరాబాద్ లో కోబ్రా మూవీ ప్రమోషన్స్ హంగామా

విక్రమ్ విలక్షణ నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నా, ఈ సినిమా లెంగ్తీగా ఉండటం వారిని నిరాశకు గురిచేస్తుందని సినీ క్రిటిక్స్ అంటున్నారు. ఇక ఈ సినిమాలో విక్రమ్ సరసన కేజీయఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించగా, ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. ఇక ట్రిమ్ చేసిన మూవీని తమిళనాడు, ఏపీ, తెలంగాణ, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో ఇవాళ సాయంత్రం నుంచే ప్రదర్శించబోతున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది.