Shikhar Dhawan: సినిమా రంగంలోకి అడుగుపెడుతున్న క్రికెటర్లు.. మొన్న ధోని ఇవాళ గబ్బర్!

భారతీయ స్టార్ క్రికెటర్లు అందరూ వరుసపెట్టి సినిమా రంగంలోకి అడుగు పెడుతున్నారు. తమ ఆట తీరుతో క్రీడా రంగంలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కొందరు స్టార్ ప్లేయర్స్ వెండితెర మీద కూడా సత్తా చాటేందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టీం ఇండియా ప్లేయర్ శిఖర్ ధావన్ కూడా బాలీవుడ్ సినిమాలో కనిపించబోతున్నాడట.

Shikhar Dhawan: సినిమా రంగంలోకి అడుగుపెడుతున్న క్రికెటర్లు.. మొన్న ధోని ఇవాళ గబ్బర్!

Cricketer Shikhar Dhawan in Bollywood Cinema

Shikhar Dhawan: భారతీయ స్టార్ క్రికెటర్లు అందరూ వరుసపెట్టి సినిమా రంగంలోకి అడుగు పెడుతున్నారు. తమ ఆట తీరుతో క్రీడా రంగంలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కొందరు స్టార్ ప్లేయర్స్ వెండితెర మీద కూడా సత్తా చాటేందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టీం ఇండియా ప్లేయర్ శిఖర్ ధావన్ కూడా బాలీవుడ్ సినిమాలో కనిపించబోతున్నాడట.

MS Dhoni: సినిమా రంగంలోకి మహేంద్రసింగ్ ధోని..

బాలీవుడ్ హీరోయిన్లు సోనాక్షి సిన్హా, హ్యూమా ఖురేషి ప్రధాన పాత్రధారులుగా తెరెక్కుతున్న ‘డబల్ ఎక్స్ ఎల్’ సినిమాలో గబ్బర్ అతిధి పాత్రలో మెరవబోతున్నాడు. హ్యూమాతో కలిసి డాన్స్ చేస్తున్న ఫోటో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ ఫోటోను హ్యూమా ఖురేషి కూడా రీ ట్వీట్ చేస్తూ పోస్ట్ చేసింది.

దేశం కోసం ఆడుతూ, క్షణం తిరుకలేకుండా జీవించే ధావన్.. సినిమా కథ నచ్చడంతో, ఈ సినిమాలో నటించానంటూ గబ్బర్ చెప్పుకొచ్చాడు. ఇటీవల కెప్టెన్ కూల్ మహింద్రసింగ్ ధోని కూడా సినిమా రంగంలోకి అడుగు పెడుతూ “ధోని ఎంటర్టైన్మెంట్” పేరుతో ప్రొడక్షన్ కంపెనీ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. అలాగే ఇర్ఫాన్ పఠాన్, శ్రీశాంత్, హర్ భజన్ కూడా సినిమారంగంలోకి అడుగుపెట్టారు. భవిషత్తులో ఇంకెంత మంది రానున్నారో చూడాలి.