లక్ష్మీ అగర్వాల్ తో దీపికా టిక్ టాక్.. వీడియోస్ వైరల్

  • Published By: veegamteam ,Published On : January 6, 2020 / 01:59 AM IST
లక్ష్మీ అగర్వాల్ తో దీపికా టిక్ టాక్.. వీడియోస్ వైరల్

ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ‘టిక్‌టాక్’ ట్రెండింగ్ లో ఉంది. సాధారణ వ్యక్తుల నుంచి సెలబ్రెటీల వరకు అందరూ టిక్ టాక్ లవర్సే.. మరి ఇప్పుడు బాలీవుడ్ టాలెంటెడ్ హీరోయిన్ దీపికా పదుకొనె టిక్ టాక్ వీడియోలు చూద్దాం. ప్రస్తుతం దీపిక చేసిన ఒక టిక్ టాక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతేకాదు ఈ వీడియోలకు దీపికా అభిమానుల నుంచి ఫుల్ పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.

15 ఏళ్ల వయసులో యాసిడ్ దాడికి గురైన లక్ష్మి అగర్వాల్ తో కలిసి ఆమె టిక్ టాక్ వీడియో చేసింది. అంతేకాదు ‘ఛపక్’ సినిమాలో లక్ష్మి పాత్రలో నటించింది. ఇటీవల లక్ష్మితో కలిసి సినిమా ప్రమోషన్స్ లో కూడా పాల్గొంది. లక్ష్మీ పాత్రలో దీపిక పదుకొనె నటించి దేశాన్ని ఆకర్షించింది. రాజి సినిమాతో దర్శకురాలిగా మంచి ప్రశంసలు అందుకున్న మేఘన గుల్జర్ ఆ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

ఇందులో మాల్తీ పాత్రలో దీపిక లీడ్‌ రోల్‌ చేస్తున్నారు. సినిమా షూటింగ్‌ను పూర్తి చేసుకున్న జనవరి 10, 2020న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. మొత్తానికి దీపికా భర్త రణ్‌వీర్‌ సింగ్‌తో కలిసి నటించిన ‘బాజీరావులో’ ని ‘లట్‌ పట్‌ లట్‌ పట్’ పాటకు చిందులేస్తూ వీడియోలను తన ఇన్‌స్టాలో షేర్‌ చేసింది. మొత్తానికి దీపికా టిక్ టాక్ లో దుమ్మురేపుతుంది.

@deepikapadukone

Swaaaag Se Swaagat!?@awezdarbar @riyaz.14 @faby_makeupartist @nagmaa @gunjanshouts @thelaxmiagarwalpihu

♬ original sound – deepikapadukone

@deepikapadukone

Boom Boom Pow!?? @ur_smartmaker

♬ original sound – deepikapadukone

@deepikapadukone

bohut zyaada masti…dher sara pyaar…❤ @thelaxmiagarwalpihu

♬ original sound – deepikapadukone