Dhanush Sir Movie: సార్ రిలీజ్ డేట్ లాక్ చేసారు!

తమిళ స్టార్ హీరో ధనుష్ నటిస్తున్న ద్విభాషా చిత్రం ‘వాతి’/‘సార్’ పేరుతో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కిస్తుండగా ఈ సినిమాను ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా, సార్ సినిమాకు సంబంధించి రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది.

Dhanush Sir Movie: సార్ రిలీజ్ డేట్ లాక్ చేసారు!

Dhanush Sir Movie Locks Release Date

Dhanush Sir Movie: తమిళ స్టార్ హీరో ధనుష్ నటిస్తున్న ద్విభాషా చిత్రం ‘వాతి’/‘సార్’ పేరుతో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కిస్తుండగా, ఈ సినిమా ఓ సోషల్ మెసేజ్‌తో పాటు పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్ సినిమాగా రానుంది. ఇక ఈ సినిమాలో ధనుష్ పాత్ర అందరినీ ఆకట్టుకునే విధంగా ఉండబోతుందని చిత్ర యూనిట్ ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్ల ద్వారా వెల్లడించింది.

SIR Movie: పాఠం కాదు.. గుణపాఠం చెబుతున్న సార్!

అయితే ఈ సినిమాను ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా, సార్ సినిమాకు సంబంధించి రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. ఈ సినిమాను డిసెంబర్ 12న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించడంతో అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో డైలాగ్ కింగ్ సాయి కుమార్ విలన్ పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి.

Sir Movie: సార్.. డిసెంబర్‌లో టెండర్ పెడుతున్నారా?

కాగా, ఈ సినిమాలో అందాల భామ సంయుక్తా మీనన్ హీరోయిన్‌గా నటిస్తోండగా, ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఈ చిత్రానికి జివి.ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. మరి సార్ సినిమాతో ధనుష్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.