నా గదిలో ఈ ఫోటో ఉండేది : ఎప్పటికైనా సినిమా చేస్తా!

ఎప్పటికైనా బాలకృష్ణ, మోక్షజ్ఞలతో సినిమా చేస్తానంటున్న అనిల్ రావిపూడి..

  • Published By: sekhar ,Published On : March 23, 2020 / 01:42 PM IST
నా గదిలో ఈ ఫోటో ఉండేది : ఎప్పటికైనా సినిమా చేస్తా!

ఎప్పటికైనా బాలకృష్ణ, మోక్షజ్ఞలతో సినిమా చేస్తానంటున్న అనిల్ రావిపూడి..

వరుస విజయాలతో జోరు మీద ఉన్న యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి మరో దర్శకుడు తరుణ్ భాస్కర్ హోస్ట్‌గా ‘ఈటీవీ ప్లస్‌లో ప్రసారమవుతున్న ‘నీకు మాత్రమే చెప్తా’ షో కి గెస్ట్‌గా విచ్చేసి తన సినిమా కెరీర్ గురించి, పర్సనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు. ఎప్పటికైనా నటసింహ నందమూరి బాలకృష్ణ, ఆయన తనయుడు మోక్షజ్ఞను డైరెక్ట్ చేస్తానని చెప్పాడు. వివరాళ్లోకి వెళ్తే..

తరుణ్ భాస్కర్ : ఓ సినిమా మ్యాగజైన్‌లో ఓ ప్రముఖ హీరో, ఆయన తనయుడు కలిసి ఉన్న ఫోటో మీ రూములో గోడకి అంటించి ఉండేదట. ఎప్పటికైనా ఆ హీరో కొడుకును డైరెక్ట్ చేస్తానని చెప్పేవారట.. ఏంటి ఆ సంగతి?..

అనిల్ రావిపూడి : నందమూరి బాలకృష్ణ గారు, ఆయన కొడుకు మోక్షజ్ఞ కలిసి ఉన్న ఫోటో అది. నా గోడకి అంటించుకున్నాను. ఎప్పటికైనా మోక్షుని డైరెక్ట్ చేస్తానని ఫ్రెండ్స్‌తో చెప్పేవాణ్ణి. బాలకృష్ణ గారితో అయినా వాళ్లబ్బాయితో అయినా సినిమా చేయడానికి నేను రెడీ. బాలయ్య బాబుతో సినిమా చేయండి, మీ కాంబోలో సినిమా వస్తే బాగుంటుంది అంటూ చాలా మంది నెటిజన్స్ నన్ను అడుగుతుంటారు.. అని చెప్పారు అనిల్. కొద్దిరోజుల క్రితం బాలయ్య, అనిల్ కలయికలో ‘రామారావు’ అనే సినిమా తెరకెక్కనుందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. నందమూరి అభిమానుల కోరిక ఎప్పుడు తీరుతుందో మరి..