D/O పార్వతమ్మ- ట్రైలర్

హరిప్రియ నటిస్తున్న 25వ కన్నడ సినిమా D/O పార్వతమ్మ ట్రైలర్ రిలీజ్..

  • Published By: sekhar ,Published On : May 14, 2019 / 11:05 AM IST
D/O పార్వతమ్మ- ట్రైలర్

హరిప్రియ నటిస్తున్న 25వ కన్నడ సినిమా D/O పార్వతమ్మ ట్రైలర్ రిలీజ్..

హరిప్రియ ప్రధాన పాత్రలో నటిస్తున్న కన్నడ సినిమా, ‘D/O పార్వతమ్మ’.. సీనియర్ నటి సుమలత అంబరీష్, సురాజ్ గౌడ, ప్రభు, తరంగ విశ్వ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా, దిషా ఎంటర్‌‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై, శశిధర్ కె.ఎమ్, విజయలక్ష్మీ కృష్ణగౌడ, సందీప్ శివమొగ్గ, శ్వేత మధుసూధన్ నిర్మిస్తున్నారు. శంకర్ జె. డైరెక్ట్ చేస్తున్నాడు. హరిప్రియ నటిస్తున్న 25వ కన్నడ సినిమా ఇదే కావడం విశేషం. రీసెంట్‌గా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది.

‘2018 ఫిబ్రవరి 1, గురువారం రాత్రి జరిగిన ఒక దారుణమైన సంఘటన’ గురించి వాయిస్ ఓవర్‌తో చెప్తుండగా స్టార్ట్ అయిన D/O పార్వతమ్మ ట్రైలర్ ఆసక్తి కరంగా ఉంది. హరిప్రియ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా కనిపిస్తుంది. తను డీల్ చేస్తున్న కేసుల మిస్టరీని చేధించడానికి ఎంతటి రిస్క్ అయినా చేసే డేరింగ్ అండ్ డాషింగ్ క్యారెక్టర్‌లో హరిప్రియ కనిపిస్తుంది. ఈ సినిమా కోసం హరిప్రియ కఠినమైన ఫీట్స్, ఫైట్స్ చేసింది. అరుల్ కె. సోమసుందరమ్ విజువల్స్, మిధున్ ముకుందన్ బ్యాగ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. మే 24న D/O పార్వతమ్మ రిలీజ్ కానుంది.

వాచ్ ట్రైలర్..