MMA Game : విజయ్ దేవరకొండ లైగర్ సినిమాలో చూపించిన MMA ఆట గురించి మీకు తెలుసా?

ఇటీవల విజయ్ దేవరకొండ లైగర్ సినిమాలో ఈ MMA గేమ్ ని చూపించారు. ఇందులో విజయ్ MMA గేమ్ వరల్డ్ ఛాంపియన్ షిప్ లో గెలవాలని ఆశిస్తుంటాడు. ఈ MMA గేమ్ గురించి తెలుసుకుందాం........

MMA Game : విజయ్ దేవరకొండ లైగర్ సినిమాలో చూపించిన MMA ఆట గురించి మీకు తెలుసా?

Do you know about MMA game in vijay devarakonada Liger movie

MMA Game :  మన దేశంలో బాక్సింగ్, మార్షల్ ఆర్ట్స్, WWE గేమ్స్ చాలా మందికి తెలుసు. కానీ MMA గేమ్ మన దేశంలో చాలా మందికి తెలీదు. ఇటీవల విజయ్ దేవరకొండ లైగర్ సినిమాలో ఈ MMA గేమ్ ని చూపించారు. ఇందులో విజయ్ MMA గేమ్ వరల్డ్ ఛాంపియన్ షిప్ లో గెలవాలని ఆశిస్తుంటాడు. ఈ MMA గేమ్ గురించి తెలుసుకుందాం.

MMA అంటే మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌. MMA ఫైట్‌ అనేది ఒక హైబ్రిడ్‌ ఫైట్. బాక్సింగ్‌, రెజ్లింగ్‌, జూడో, కరాటే, థాయ్‌ బాక్సింగ్‌.. లాంటి పలు గేమ్స్ నుంచి కొన్ని కొన్ని టెక్నిక్స్‌తో తీసుకొని MMA ని రూపొందించారు. అయితే MMA మొదట్లో రూల్స్ ఏమి పెట్టకపోవడంతో ఇది చాలా క్రూరమైన క్రీడగా మారింది. కొన్ని దేశాల్లో దీన్ని బ్యాన్ కూడా చేశారు. కానీ ఆ చెడ్డ పేరు నుంచి బయటపడి ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక మంది ప్రేక్షకులు చూస్తున్న గేమ్స్ లో ఒకటిగా నిలిచింది.

Karthikeya 2 : నిఖిల్ ఏంటి..? బాలీవుడ్ కి వెళ్లడమేంటి..?.. కర్నూలు గడ్డ మీద కార్తికేయ 2 వంద కోట్ల సెలబ్రేషన్స్.. స్పీచ్ అదరగొట్టిన నిఖిల్

20వ శతాబ్దం ఆరంభంలో బ్రెజిల్ లోని వాలే ట్యూడో ద్వారా ఈ MMA గేమ్‌ వెలుగులోకి వచ్చింది. కార్లో, హెలియో అనే ఇద్దరు సోదరులు నార్త్ అమెరికాలో ఈ గేమ్‌కు బాగా పాపులారిటీ తీసుకొచ్చారు. ఈ అన్నదమ్ములే MMA టోర్నమెంట్ కు యూఎఫ్‌సీ(UFC)-అల్టిమేట్ ఫైటింగ్ ఛాంపియన్ షిప్ అని పేరు పెట్టి టాప్ గేమ్ గా తీసుకెళ్లారు. అయితే ఇప్పటికి MMA గేమ్ పై కొన్ని దేశాల్లో ఆంక్షలు ఉన్నాయి.

ఒకప్పుడు ఎలాంటి నిబంధనలు లేని ఈ గేమ్ కి ఇప్పుడు అనేక కఠిన నిబంధనలను పెట్టారు. ఈ టోర్నమెంట్ లో పాల్గొనేవాళ్ళు కచ్చితంగా ఈ నిబంధనల్ని పాటించాల్సిందే. MMAలో రూల్స్‌ కింద ఒక్కో రౌండు ఐదు నిమిషాల చొప్పున మూడు రౌండ్లు పోరాడాలి. ఒక్కో రౌండు ముగిసిన తర్వాత ఒక నిమిషం విశ్రాంతినిస్తారు. అదే చాంపియన్‌షిప్‌ లో అయితే ఐదు రౌండ్లు ఉంటాయి. ప్రత్యర్థిని నాకౌట్‌ చేయడం లేదా ప్రత్యర్థి ఓటమి ఒప్పుకునేలా చేయడం ద్వారా గెలుపును నిర్ణయిస్తారు. ఒకవేళ ఇద్దరు ఆటగాళ్లు సమంగా పోరాడితే విజేత ఎవరనేది జడ్జి ప్యానెల్‌ నిర్ణయిస్తుంది.

Pranitha Subhash : తల్లి అయిన తర్వాత మొదటిసారి బోల్డ్ ఫోటోలు షేర్ చేసిన హీరోయిన్ ప్రణీత

అమెరికాలోని నెవడా రాష్ట్రంలోని లాస్‌వేగాస్‌లో MMA ప్రధాన సంస్థ UFC ఉంది. ప్రతీ సంవత్సరం వివిధ స్థాయిల్లో యూఎఫ్‌సీ ఎంఎంఏ విభాగంలో ఈవెంట్లు నిర్వహిస్తుంది. అందుకే విజయ్‌ దేవరకొండ లైగర్‌ సినిమా సెకండాఫ్‌ మొత్తం లాస్‌వేగాస్‌లోనే ఉంటుంది. ఈ సినిమా ద్వారా MMA గేమ్ ఇండియాలో చాలా మందికి తెలిసింది. WWE కి మన దేశంలో ఆదరణ ఉన్నట్టే లైగర్ సినిమా వల్ల MMA గేమ్ కి కూడా ఇప్పుడు ఆదరణ కచ్చితంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి.