హృదయాల్ని హత్తుకుంటున్న ‘ఏమో ఏమో ఏ గుండెల్లో’ సాంగ్

నందమూరి కళ్యాణ్ రామ్, మెహరీన్ జంటగా.. సతీష్ వేగేశ్న దర్శకత్వంలో రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.. ‘ఎంత మంచివాడవురా’ ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్..

  • Published By: sekhar ,Published On : December 9, 2019 / 05:51 AM IST
హృదయాల్ని హత్తుకుంటున్న ‘ఏమో ఏమో ఏ గుండెల్లో’ సాంగ్

నందమూరి కళ్యాణ్ రామ్, మెహరీన్ జంటగా.. సతీష్ వేగేశ్న దర్శకత్వంలో రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.. ‘ఎంత మంచివాడవురా’ ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్..

 

నందమూరి కళ్యాణ్ రామ్, మెహరీన్ జంటగా.. సతీష్ వేగేశ్న దర్శకత్వంలో రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.. ‘ఎంత మంచివాడవురా’.. శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణ ప్రసాద్ సమర్పణలో, ఆదిత్య మ్యూజిక్ ఇండియా (ప్రైవేట్) లిమిటెడ్ పతాకంపై ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తా నిర్మిస్తున్నారు. ఆదివారం ‘ఎంత మంచివాడవురా’ ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు.

‘ఏమో ఏమో ఏ గుండెల్లో ఏ బాధ ఉందో.. ఓ కొంచెం పాలు పంచుకుందాం.. ఏమో ఏమో ఏ దారుల్లో ఏ బంధముందో బంధువుల సంఖ్య పెంచుకుందాం.. చెయ్యందుకుందాం చిగురంత ధైర్యమై.. భరోసానిద్దాం పద మనోబలమై.. మనుషులం మనందరం ఏకాకులం కాదే ఎవ్వరం.. మంచితనం మనగుణం పరస్పరం సాయం కాగలం‘ అనే పల్లవితో సాగే ఈ పాట మనసుల్ని తాకేలా ఉంది.. గోపి సుందర్ సంగీతం, రామజోగయ్య శాస్త్రి సాహిత్యం, గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గాత్రం ఈ పాటకు ప్లస్ అయ్యాయి..

‘ఓ గుండె నిప్పును ఆర్పడం, ఆపడం కదా ఉపకారం.. వేరెవరి హాయికో జోలాలి పాడడం ఆహా ఎంతవరం’.. ‘కష్టాల బరువును తేలికపరిచే భుజం మనమౌదాం’ వంటి పదాలతో హృదయాల్ని హత్తుకుంటుందీ పాట.. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుందీ చిత్రం.. ప్రస్తుతం ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. సంక్రాంతి కానుకగా 2020 జనవరి 15న ‘ఎంత మంచివాడవురా’ రిలీజ్ కానుంది. విజయ్ కుమార్, శరత్ బాబు, సుహాసిని, ప్రగతి, ప్రభు, వీకే నరేష్, వెన్నెల కిషోర్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు సంగీతం : గోపి సుందర్, కెమెరా : రాజ్ తోట, ఎడిటింగ్ : తమ్మిరాజు, ఆర్ట్ : రామాంజనేయులు, ఫైట్స్ : వెంకట్.