‘ఎంత మంచివాడవురా’ జనవరి 15 ఫిక్స్

‘ఎంత మంచివాడవురా’ తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి కానుకగా 2020 జనవరి 15న ప్రేక్షకుల ముందుకు రానుంది..

  • Published By: sekhar ,Published On : November 8, 2019 / 05:21 AM IST
‘ఎంత మంచివాడవురా’ జనవరి 15 ఫిక్స్

‘ఎంత మంచివాడవురా’ తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి కానుకగా 2020 జనవరి 15న ప్రేక్షకుల ముందుకు రానుంది..

నందమూరి కళ్యాణ్ రామ్, మెహరీన్ జంటగా.. సతీష్ వేగేశ్న దర్శకత్వంలో రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.. ‘ఎంత మంచివాడవురా’.. ఈ సినిమాతో ఆదిత్య మ్యూజిక్ ఇండియా (ప్రైవేట్) లిమిటెడ్ సంస్థ నిర్మాణరంగంలోకి అడుగుపెట్టింది.. శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణ ప్రసాద్ సమర్పణలో, ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తా నిర్మిస్తున్న ‘ఎంత మంచివాడవురా’ టీజర్ దసరా స్పెషల్‌గా రిలీజ్ చేయగా మంచి స్పందన లభించింది.

ప్రేక్షకులకు దీపావళి విషెస్ చెబుతూ.. ‘సంక్రాంతికి కలుద్దాం’ అని చెప్పిన మూవీ యూనిట్ రీసెంట్‌గా రిలీజ్ డేట్ కన్ఫమ్ చేసింది. ‘ఎంత మంచివాడవురా’ తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి కానుకగా 2020 జనవరి 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read Also : ఫ్యాన్స్‌కు రవితేజ బర్త్‌డే గిఫ్ట్ ‘డిస్కోరాజా’

కుటుంబ విలువలు, బంధాలకు పెద్దపీట వేస్తూ రూపొందిస్తున్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని నిర్మాతలు తెలిపారు. విజయ్ కుమార్, శరత్ బాబు, సుహాసిని, ప్రగతి, ప్రభు, వీకే నరేష్, వెన్నెల కిషోర్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు సంగీతం : గోపి సుందర్, కెమెరా : రాజ్ తోట, ఎడిటింగ్ : తమ్మిరాజు, ఆర్ట్ : రామాంజనేయులు, ఫైట్స్ : వెంకట్.