Prabhas : వింటేజ్ ప్రభాస్‌ని చూసి ఎమోషనల్ అవుతున్న ఫ్యాన్స్..

అన్‌స్టాపబుల్‌లో బాలయ్యతో బాహుబలిని చూడడానికి అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ ఎపిసోడ్ ప్రోమోని విడుదల చేశారు షో నిర్వాహకులు. ఈ ఎపిసోడ్ లో ప్రభాస్ తో పాటు మ్యాచో స్టార్ గోపీచంద్ కూడా పాల్గొని సందడి చేశాడు. కాగా..

Prabhas : వింటేజ్ ప్రభాస్‌ని చూసి ఎమోషనల్ అవుతున్న ఫ్యాన్స్..

Fan are happy to see Vintage Prabhas

Prabhas : అన్‌స్టాపబుల్‌లో బాలయ్యతో బాహుబలిని చూడడానికి అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ఫోటోలను, ప్రోమోలను విడుదల చేసి ఫ్యాన్స్ ని ఫుల్ ఖుషి చేశారు మేకర్స్. తాజాగా ఈ ఎపిసోడ్ ప్రోమోని విడుదల చేశారు షో నిర్వాహకులు. ఈ ఎపిసోడ్ లో ప్రభాస్ తో పాటు మ్యాచో స్టార్ గోపీచంద్ కూడా పాల్గొని సందడి చేశాడు.

Prabhas: బాలయ్య షోలో ప్రభాస్ వేసుకున్న షర్ట్ ధర ఎంతో తెలుసా..?

విడుదలైన ప్రోమో ఫుల్ ఎనర్జిటిక్‌గా ఉంది. ఇక ఈ ఎపిసోడ్ లో ప్రభాస్ ని చూసిన అభిమానులైతే ఎమోషనల్ అవుతున్నారు. ప్రభాస్ అంటేనే చలాకితనం. అలాంటిది గత కొంతకాలంగా ప్రభాస్ నటిస్తున్న సినిమాలో అది కనిపించకపోవడంతో అభిమానులు.. ఒకప్పటి డార్లింగ్ ని మిస్ అవుతున్నట్లు ఈ మధ్య కాలంలో కూడా సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. అయితే తాజాగా విడుదలైన అన్‌స్టాపబుల్‌ ప్రోమో వాళ్ళ కలని నెరవేర్చింది.

ప్రోమోలో ప్రభాస్ అల్లరి చేస్తూ చలాకిగా కనిపించడం, తన స్నేహితులను గోపీచంద్, రామ్ చరణ్ లను ‘ఒరేయ్ మీరు నా స్నేహితులేనా అసలు’ అని అనడం. ముఖ్యంగా బుజ్జిగాడు స్లాంగ్ లో మళ్ళీ మాట్లాడడం అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. దీంతో ‘వింటేజ్ ప్రభాస్ ఈజ్ బ్యాక్’ అంటూ వీడియోలు ఎడిట్ చేసి పోస్ట్ చేస్తున్నారు. మరి ప్రోమోతోనే ఇంతగా అట్రాక్ట్ చేసిన ఆహా టీమ్ ఫుల్ ఎపిసోడ్ తో ఇంకెంత మ్యాజిక్ చేయనుందో.