F9 : ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 9’.. ఇండియాలో రిలీజ్ ఎప్పుడంటే..

వరల్డ్ వైడ్‌గా మూవీ లవర్స్‌ని మరింత ఎంటర్‌టైన్ చెయ్యడానికి ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ ఫ్రాంచైజ్‌లో వస్తున్న అడ్వంచరస్ అండ్ మోస్ట్ అవైటెడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 9 – ది ఫాస్ట్ సాగా’..

F9 : ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 9’.. ఇండియాలో రిలీజ్ ఎప్పుడంటే..

F9

F9: వరల్డ్ వైడ్‌గా మూవీ లవర్స్‌ని మరింత ఎంటర్‌టైన్ చెయ్యడానికి ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ ఫ్రాంచైజ్‌లో వస్తున్న అడ్వంచరస్ అండ్ మోస్ట్ అవైటెడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 9 – ది ఫాస్ట్ సాగా’.. విన్ డీజిల్, మిచెల్ రోడ్రిగెజ్, టైరెస్ గిబ్సన్ తదితరులు కీలకపాత్రల్లో నటించిన ఈ మూవీ ట్రైలర్స్‌తోనే సెన్సేషన్ క్రియేట్ చేసింది. గూస్ బంప్స్ తెప్పించే యాక్షన్ ఎపిసోడ్స్‌తో ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 9’ (ఎఫ్ 9) ట్రైలర్ మూవీ లవర్స్‌ని ఆకట్టుకుంది.

ఇప్పటికి 8 సిరీస్‌లు వచ్చినా… ఇంకా ఆ యాక్షన్ ఎంటర్‌టైనర్ నెక్ట్స్ సిరీస్‌లు ఎప్పుడొస్తాయా అని వెయిట్ చేస్తుంటారు ఫ్యాన్స్. ఎంటర్‌టైన్‌మెంట్ చరిత్రలో ఇప్పుడు ఎలక్ట్రిఫైయింగ్ యాక్షన్ సీన్స్‌తో హాలీవుడ్ మోస్ట్ ఎంటర్‌టైనింగ్ సిరీస్ ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’. ఈ సినిమాకి సంబంధించి నైన్త్ మూవీని ఇటీవల యూఎస్, యూకే దేశాల్లో రిలీజ్ చెయ్యగా మిలియన్ల కొద్ది కలెక్షన్లతో అదరగొట్టేసింది.

F9

ఇప్పుడు ఇండియన్ బాక్సాఫీస్ పైకి దూసుకురానుంది. ఆగస్టు 5న ఇంగ్లీష్, హిందీ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో భారీగా విడుదల చెయ్యనున్నారు. అయితే మోస్ట్ సక్సెస్ ఫుల్ ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ ఫ్రాంచైజ్ ఇక ఎండ్ అయ్యే టైమొచ్చిందని షాక్ ఇచ్చారు మేకర్స్. ఆడియెన్స్ అడిక్ట్ అయిపోయిన ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ సిరీస్‌లో ప్రతి పార్ట్ ఎగ్జైటింగ్‌గా, ఎంటర్‌టైనింగ్‌‌గా, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా కంటిన్యూ అవుతున్న ఈ సిరీస్‌ని ఇక్కడితో ఎండ్ చెయ్యాలనిడిసైడ్ అయ్యారు మేకర్స్.

F9

2001 లో రిలీజ్ అయిన ఫస్ట్ పార్ట్ 7300 కోట్ల కలెక్షన్స్‌తో రికార్డ్ క్రియేట్ చేసింది. అప్పటినుంచి కలెక్షన్లు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. కానీ, ఇంకా ఈ సినిమాని సాగదియ్యకుండా మంచి వ్యూయర్ షిప్‌తోనే ఎండ్ చెయ్యాలని ఫిక్స్ అయ్యారు. ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 9 – ది ఫాస్ట్ సాగా’ రిలీజ్ కోసం ఇండియన్ ఆడియెన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.