ప్రియ బర్త్‌డే వేడుకల్లో ఘట్టమనేని ఫ్యామిలీ సందడి!..

  • Edited By: sekhar , October 7, 2020 / 06:16 PM IST
ప్రియ బర్త్‌డే వేడుకల్లో ఘట్టమనేని ఫ్యామిలీ సందడి!..

Ghattamaneni Family: నట శేఖర, సూపర్‌‌స్టార్‌ కృష్ణ చిన్న కూతురు, సూపర్‌‌స్టార్‌ మహేష్ బాబు సోదరి, హీరో సుధీర్‌ బాబు భార్య ప్రియదర్శిని పుట్టిన రోజు వేడుకను ఘట్టమనేని ఫ్యామిలీ గ్రాండ్‌గా సెలెబ్రేట్‌ చేసింది. అమ్మ ఇందిరా దేవి, నాన్న కృష్ణ, బాబాయ్ ఆదిశేషగిరి రావు, బావలు జయదేవ్‌, సంజయ్‌ స్వరూప్‌, సుధీర్‌లతో కలిసి సందడిగా గడిపారు మహేష్.


సోదరీమణులు, బావలు, నాన్న కృ​ష్ణతో కలిసి మహేశ్‌ బాబు-నమ్రత జంట భోజనం చేశారు. ఈ ఫోటోలను సుధీర్‌ బాబు ట్విటర్‌లో పోస్ట్‌ చేస్తూ.. ‘ఈ రోజు నా లైఫ్‌ పుట్టింది. హ్యాపీ బర్త్‌డే ప్రియా’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు.


ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. మహేష్ ఫ్యాన్స్ ఘట్టమనేని ఫ్యామిలీ అందరినీ ఒకే ఫ్రేములో చూడడం చాలా హ్యాపీగా ఉందంటూ ఈ పిక్స్ షేర్ చేస్తున్నారు.

ImageImageImage