Gopichand: శ్రీవాస్‌ దర్శకత్వంలో గోపీచంద్‌.. హ్యాట్రిక్ కొడతారా?

కరోనా తగ్గుముఖం పట్టడంతో ఇప్పటికే షూటింగ్ లో ఉన్న సినిమాలు ముమ్మరంగా పనులు మొదలుపెడితే.. కొత్త సినిమాలకు కొబ్బరికాయలు క్లాప్ కొడుతున్నారు. ఇప్పటికే టాలీవుడ్ లో రామ్, నాగశౌర్య లాంటి యంగ్ హీరోలు వారి కొత్త సినిమాలను మొదలుపెట్టగా ఇప్పుడు యాక్షన్ హీరో గోపీచంద్ కూడా మరో క్రేజీ కాంబినేషన్ లో సినిమా మొదలుపెట్టాడు. గోపీచంద్ కెరియర్ లో లక్ష్యం సినిమా ముమ్మాటికీ భారీ సక్సెస్ సినిమానే.

Gopichand: శ్రీవాస్‌ దర్శకత్వంలో గోపీచంద్‌.. హ్యాట్రిక్ కొడతారా?

Gopichand

Gopichand: కరోనా తగ్గుముఖం పట్టడంతో ఇప్పటికే షూటింగ్ లో ఉన్న సినిమాలు ముమ్మరంగా పనులు మొదలుపెడితే.. కొత్త సినిమాలకు కొబ్బరికాయలు క్లాప్ కొడుతున్నారు. ఇప్పటికే టాలీవుడ్ లో రామ్, నాగశౌర్య లాంటి యంగ్ హీరోలు వారి కొత్త సినిమాలను మొదలుపెట్టగా ఇప్పుడు యాక్షన్ హీరో గోపీచంద్ కూడా మరో క్రేజీ కాంబినేషన్ లో సినిమా మొదలుపెట్టాడు. గోపీచంద్ కెరియర్ లో లక్ష్యం సినిమా ముమ్మాటికీ భారీ సక్సెస్ సినిమానే. అనుష్క, జగపతి బాబు, కోటా శ్రీనివాస్ రావు లాంటి భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ సినిమాకి ఇప్పటికే టీవీల్లో అదే ఆదరణ దక్కించుకుంటుంది.

లక్ష్యం సినిమాతో శ్రీవాస్ దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఆ తర్వాత ఈ కాంబినేషన్ లో లౌక్యం అనే మరో సినిమా కూడా రూపొందింది. అప్పటికే వాంటెడ్, మొగుడు లాంటి ప్లాపులలో ఉన్న గోపీచంద్ కు లౌక్యం రిలీఫ్ ఇచ్చింది. కాగా, ఇప్పుడు ఈ కాంబినేషన్ లో మూడవ సినిమా సెట్టైంది. గోపీచంద్‌ కెరీర్‌లో ఇది 30వ సినిమా కాగా పీపుల్‌మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు. భూపతిరాజా కథ విన్న గోపీచంద్‌ వెంటనే ఒకే చెప్పగా దర్శకుడు శ్రీవాస్‌తో మరోసారి అసోసియేట్‌ అవుతున్నందుకు హర్షం వ్యక్తం చేశారు.

ఇక ఈ సినిమా ప్రకటనతో పాటు విడుదల చేసిన పోస్టర్ చూసే కోల్‌కత్తా బ్యాక్ డ్రాప్ లో సాగే కథగా కనిపిస్తుంది. పోస్టర్ లో హౌరా బ్రిడ్జితో పాటు ప్రజలు గూమికూడి ట్రాఫిక్‌తో ఉన్న కోల్‌కత్తాలో ఫేమస్‌ కాళీమాత విగ్రహం కనిపిస్తున్నాయి. ఈ అంశాలు గోపీచంద్, శ్రీవాస్‌ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై మరిన్ని అంచనాలను క్రియేట్‌ చేస్తున్నాయి. అలాగే ఈ సినిమా కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో మరింత ఆసక్తికరంగా సాగుతుందని తెలుస్తుంది. భారీ బడ్జెట్‌తో రూపొందనున్న ఈ సినిమా టైటిల్‌ ఖరారు కావాల్సి ఉంది.

మరి ఈ కాంబినేషన్లో వస్తున్న ఈ హ్యాట్రిక్ సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొడతారా లేదా అన్నది చూడాల్సి ఉండగా ప్రస్తుతం గోపీచంద్ మారుతి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న‌‘పక్కా కమర్షియల్‌’ సినిమాతో బిజీగా ఉండగా ఈ సినిమా షూటింగ్‌ పూర్తయిన వెంట‌నే శ్రీవాస్ మూవీ షూటింగ్‌ స్టార్ట్‌ అవుతుంది. ఇక ఈ సినిమాకు గురించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి. అలాగే సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్ నటించిన సీటిమార్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే.