గల్లీబాయ్ సాంగ్స్ విన్నారా?

గల్లీబాయ్ ఆడియో సాంగ్స్ రిలీజ్.

  • Published By: sekhar ,Published On : January 28, 2019 / 09:40 AM IST
గల్లీబాయ్ సాంగ్స్ విన్నారా?

గల్లీబాయ్ ఆడియో సాంగ్స్ రిలీజ్.

రణ్‌వీర్ సింగ్, అలియా భట్ జంటగా, జోయా అక్తర్ డైరెక్షన్‌లో రూపొందుతున్న మూవీ, గల్లీబాయ్.. అప్నా టైమ్ ఆయేగా అనేది ట్యాగ్‌లైన్. ఫర్హాన్ అక్తర్, రితేష్ సిద్వాణీ, జోయా అక్తర్ నిర్మాతలు. ఈ సినిమా ఫస్ట్ లుక్ అండ్ టీజర్‌కి మంచి రెస్పాన్స్ వస్తుంది. రీసెంట్‌గా గల్లీబాయ్ ఆడియో సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. రణవీర్ సింగ్ పాడిన ర్యాప్‌తో గల్లీబాయ్ ఆల్బమ్ మొదలవుతుంది. కథ ప్రకారం మ్యూజిక్ బ్యాక్ డ్రాప్‌లో ఉంటుంది కాబట్టి, మ్యూజిక్‌కి ఇంపార్టెన్స్ ఇస్తూ, సూపర్బ్ సాంగ్స్ అండ్ ర్యాప్స్ రూపొందించారు సంగీత దర్శకులు శంకర్, ఎహషాన్, లాయ్ అండ్ కర్ష్ కాలే… ఈ ఆల్బమ్‌లో రణవీర్ సింగ్ దాదాపు సెవన్ ర్యాప్స్ పాడడం విశేషం. సాంగ్స్ డ్యూరేషన్ 46 నిమిషాలు..

చక్కటి లిరిక్స్, వాటికి తగ్గట్టు సింగర్స్ అందరూ చాలాబాగా పాడారు. ముంబైలోని మురికివాడలో నివసించే ఒక కుర్రాడికి పెద్ద ర్యాపర్ కావాలనీ, తన టాలెంట్‌తో సంగీత ప్రపంచంలో సంచలనం సృష్టించాలనీ ఉంటుంది. పేదరికం, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఇవి చాలవన్నట్టు లవ్.. వీటన్నిటినీ ఫేస్ చేస్తూ, తన యాంబిషన్‌ని ఎలా నెరవేర్చుకున్నాడు అనేది గల్లీబాయ్ కాన్సెప్ట్. కల్కీ కొచ్చిన్, విజయ్ రాజ్ తదితరులు నటిస్తున్న గల్లీబాయ్, ప్రేమికుల దినోత్సవం కానుకగా, ఫిబ్రవరి 14న రిలీజ్ కానుంది. 

లిజన్ గల్లీబాయ్ సాంగ్స్…