Hero Karthi : ఒకప్పుడు నేను మణిరత్నం గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్.. 60 ఏళ్ల తరువాత మణిరత్నం గారి వల్ల ఆ కల నెరవేరింది

ఈ ప్రెస్ మీట్ లో హీరో కార్తీ మాట్లాడుతూ.. ''ఇది నాకు చాలా స్పెషల్ స్టేజ్. ఒకప్పుడు మణిరత్నం గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశాను. ఇప్పుడు ఆయన సినిమాలో నటిస్తున్నాను. పొన్నియిన్ సెల్వన్ ఒక నవల. ఎంజీఆర్, కమల్ సర్ లాంటి చాలా మంది...........

Hero Karthi : ఒకప్పుడు నేను మణిరత్నం గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్.. 60 ఏళ్ల తరువాత మణిరత్నం గారి వల్ల ఆ కల నెరవేరింది

Hero Karthi speech in chola chola song from ponniyin selvan release event

Hero Karthi :  మణిరత్నం దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా పొన్నియిన్ సెల్వన్. ఈ సినిమాని రెండు భాగాలుగా రిలీజ్ చేయనున్నారు. పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1 సెప్టెంబర్‌ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో విక్రమ్‌, కార్తి, జయం రవి, ఐశ్వర్యారాయ్‌, త్రిష.. లాంటి స్టార్లతో పాటు ఎంతోమంది ప్రముఖులు నటించారు. మద్రాస్‌ టాకీస్‌, లైకా ప్రొడక్షన్స్‌ సంస్థలు కలిసి సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించగా తెలుగులో ఈ సినిమాని దిల్‌రాజు రిలీజ్ చేయబోతున్నారు. శుక్రవారం సాయంత్రం పొన్నియన్ సెల్వన్ లోని చోళ చోళ… అంటూ సాగే పాటని హైదరాబాద్‌లో విడుదల చేస్తూ ప్రెస్ మీట్ నిర్వహించారు.

Manirathnam : బాహుబలి వల్లే పొన్నియిన్ సెల్వన్ తీయగలిగాను.. రాజమౌళి వల్లే ఇదంతా సాధ్యమైంది..

ఈ ప్రెస్ మీట్ లో హీరో కార్తీ మాట్లాడుతూ.. ”ఇది నాకు చాలా స్పెషల్ స్టేజ్. ఒకప్పుడు మణిరత్నం గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశాను. ఇప్పుడు ఆయన సినిమాలో నటిస్తున్నాను. పొన్నియిన్ సెల్వన్ ఒక నవల. ఎంజీఆర్, కమల్ సర్ లాంటి చాలా మంది ఈ నవలని సినిమాగా తీయాలి అని అనుకున్నారు. కానీ 60 ఏళ్ల తరువాత మణిరత్నం గారి వల్ల ఆ కల నెరవేరింది. ఈ సినిమాలో 5 మెయిన్ క్వారెక్టర్స్ ఉన్నాయి. ఇందులో ఆరోజు ఉన్న రాజకీయాలు గురించి చెప్తూనే ఇప్పుడు రాజకీయాల్లో కూడా ఏమి జరుగుతుందో చూపించారు. ఇలాంటి సినిమాని మణి సార్ మాత్రమే తీయగలరు. కేవలం 140 రోజుల్లోనే రెండు పార్టులు షూటింగ్స్ అయిపోయాయి. అంత ఫాస్ట్ గా సినిమాని షూట్ చేశారు. రెహమాన్ గారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు పొన్నియిన్ సెల్వన్ సినిమాకి” అని తెలిపారు.