Manirathnam : బాహుబలి వల్లే పొన్నియిన్ సెల్వన్ తీయగలిగాను.. రాజమౌళి వల్లే ఇదంతా సాధ్యమైంది..

Manirathnam : బాహుబలి వల్లే పొన్నియిన్ సెల్వన్ తీయగలిగాను.. రాజమౌళి వల్లే ఇదంతా సాధ్యమైంది..

Manirathnam said ponniyin selvan possible because of Rajamouli Bahubali

 

Manirathnam :  మణిరత్నం దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా పొన్నియిన్ సెల్వన్. ఈ సినిమాని రెండు భాగాలుగా రిలీజ్ చేయనున్నారు. పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1 సెప్టెంబర్‌ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో విక్రమ్‌, కార్తి, జయం రవి, ఐశ్వర్యారాయ్‌, త్రిష.. లాంటి స్టార్లతో పాటు ఎంతోమంది ప్రముఖులు నటించారు. మద్రాస్‌ టాకీస్‌, లైకా ప్రొడక్షన్స్‌ సంస్థలు కలిసి సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించగా తెలుగులో ఈ సినిమాని దిల్‌రాజు రిలీజ్ చేయబోతున్నారు. శుక్రవారం సాయంత్రం పొన్నియన్ సెల్వన్ లోని చోళ చోళ… అంటూ సాగే పాటని హైదరాబాద్‌లో విడుదల చేస్తూ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ పాటని అనంత శ్రీరామ్‌ రచించగా మ్యూజిక్ డైరెక్టర్ ఎ.ఆర్‌.రెహమాన్‌ ఆధ్వర్యంలో మనో, అనురాగ్‌ కులకర్ణి కలిసి ఆలపించారు.

Vivek Ranjan Agnihotri : మీ సినిమాలని బాయ్ కాట్ చేస్తే నష్టమా.. చిన్న సినిమాలని మీరు అడ్డుకున్నప్పుడు.. బాలీవు డాన్ లకు కౌంటర్..

ఈ ప్రెస్ మీట్ లో డైరెక్టర్ మణిరత్నం మాట్లాడుతూ.. ”నేను ఈ సినిమా తీస్తున్నందుకు చిరంజీవితో సహా చాలా మందికి థ్యాంక్స్ చెప్పాలి. ముఖ్యంగా రాజమౌళికి కృతజ్ఞతలు తెలపాలి. ఇలాంటి పెద్ద పెద్ద కథల్ని ఎలా తీయాలో బాహుబలి తీసి చూపించి మా లాంటి దర్శకులకు ఓ దారి చూపించారు. నేను ఎప్పట్నుంచో ఈ సినిమా తెద్దామనుకున్నాను కానీ బాహుబలి రెండు పార్టులు రిలీజ్ చేసిన తర్వాత ఒకే కథని ఇలా రెండు పార్టులుగా అద్భుతంగా తెరకెక్కించొచ్చు అని రాజమౌళి తీసి చూపించారు. దీంతో ఈ కథని కూడా నేను రెండు పార్టులుగా తీద్దామని ఫిక్స్ అయ్యాను. రాజమౌళి వల్లే ఇది సాధ్యమైంది” అని తెలిపారు. దీంతో మణిరత్నం లాంటి స్టార్ డైరెక్టర్ రాజమౌళిని పొగడటంతో ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.