Vikram : లెక్కలు రావు.. కానీ మ్యాథ్స్ టీచర్ గా చేశా.. కోబ్రా కథ ఇదే.. ఇందులో ఇర్ఫాన్ పఠాన్ కూడా యాక్ట్ చేశాడు..

ప్రెస్ మీట్ లో విక్రమ్ మాట్లాడుతూ.. ''కొన్ని కథలు వినగానే చేయాలనిపిస్తుంది. అలాంటి కథే ‘కోబ్రా’. ఇది ఒక సైకలాజికల్‌ థ్రిల్లర్‌, సైన్స్‌ ఫిక్షన్‌, ఎమోషనల్‌ డ్రామా కథ. ఇందులో 9 గెటప్స్ ఉన్నాయి. ఒక్కో గెటప్ కి.................

Vikram : లెక్కలు రావు.. కానీ మ్యాథ్స్ టీచర్ గా చేశా.. కోబ్రా కథ ఇదే.. ఇందులో ఇర్ఫాన్ పఠాన్ కూడా యాక్ట్ చేశాడు..

Hero Vikram spoke about Cobra Movie in Pressmeet

Vikram :  విక్రమ్ హీరోగా, శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా తెరకెక్కిన సినిమా కోబ్రా. పాన్ ఇండియా సినిమాగా ఆగస్టు 31న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే రిలీజ్ అయినా ట్రైలర్, ఇందులో విక్రమ్ 9 గెటప్స్ వేయడం.. వీటితో సినిమాపై అంచనాలు పెరిగాయి. ప్రస్తుతం చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఈ ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు.

ఈ ప్రెస్ మీట్ లో విక్రమ్ మాట్లాడుతూ.. ”కొన్ని కథలు వినగానే చేయాలనిపిస్తుంది. అలాంటి కథే ‘కోబ్రా’. ఇది ఒక సైకలాజికల్‌ థ్రిల్లర్‌, సైన్స్‌ ఫిక్షన్‌, ఎమోషనల్‌ డ్రామా కథ. ఇందులో 9 గెటప్స్ ఉన్నాయి. ఒక్కో గెటప్ కి ఒక్కో బాడీ లాంగ్వేజ్‌, ఒక్కో మేనరిజం ఉన్నాయి. వీటిని నటిస్తున్నప్పుడు చాలా కష్టపడ్డాను. నటుడిగా నాకే కాదు ఈ సినిమా మొదలుపెట్టాక సినిమాకి కూడా అనేక అడ్డంకులు ఎదురయ్యాయి. వీటన్నిటిని దాటి మీ ముందుకొస్తుంది ఈ సినిమా.”

Vidyasagar Raju : టాలీవుడ్ లో విషాదం.. సీనియర్‌ నటుడు, రచయిత విద్యాసాగర్‌ రాజు కన్నుమూత..

”ఈ సినిమాలో నేను మ్యాథ్స్ టీచర్ గా నటించాను. అసలు నాకు మ్యాథ్స్ రావు. అది చాలా కష్టమైనా సబ్జెక్ట్. ఈ సినిమాలో లెక్కల్ని వాడి ఎలాంటి సాహసాలు చేశారనేది చూపించబోతున్నాం. టైటిల్ కోబ్రా అని ఎందుకు పెట్టారంటే కోబ్రా ఎప్పుడు కాటేస్తుందో తెలియదు. కోబ్రా తన చర్మాన్ని మారుస్తూ ఉంటుంది. ఇందులో నా పాత్ర కూడా అంతే. సినిమాలో లెక్కలు ఉన్నాయి, ఇదేదో అర్ధం కావడానికి కష్టమైన సినిమా అనుకోకండి. లెక్కలతో పాటు అన్ని రకాల భావోద్వేగాలు ఈ సినిమాలో ఉంటాయి. క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ మొదటి సినిమా ఇది. మొదటి సినిమాలోనే చాలా చక్కగా నటించాడు” అని తెలిపారు. ఈ కొత్త రకం కథ, 9 గెటప్స్ లో విక్రమ్ ని చూడటానికి అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్నారు.