Heroins : పెళ్లయి పిల్లలు పుట్టాక కూడా ఫిట్ గా బాడీ మెయింటైన్ చేస్తున్న హీరోయిన్స్..
హీరోయిన్లు సినిమాలు చేస్తున్నంత కాలం ఫిట్నెస్ తో ఫిజిక్ మెయింటెన్ చేస్తూనే ఉండాలి. మరి పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్నాక కూడా అదే ఫిట్నెస్ తో కనిపిస్తున్నారు ఈమధ్యే తల్లిగా ప్రమోషన్ తెచ్చుకున్న హీరోయిన్లు.............

Heroins maintain good body even after became mother
Heroins : హీరోయిన్లు సినిమాలు చేస్తున్నంత కాలం ఫిట్నెస్ తో ఫిజిక్ మెయింటెన్ చేస్తూనే ఉండాలి. మరి పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్నాక కూడా అదే ఫిట్నెస్ తో కనిపిస్తున్నారు ఈమధ్యే తల్లిగా ప్రమోషన్ తెచ్చుకున్న హీరోయిన్లు. సినిమాలు చేసినా చేయకపోయినా ఫిట్నెస్ మాత్రం ఇంపార్టెంట్ అంటున్నారు ఈ భామలు.
ఆలియా భట్ ప్రస్తుతం పోస్ట్ ప్రెగ్నెన్సీ పీరియడ్ లో ఉంది. ఒక వైపు పాపను చూసుకుంటూనే ఫిట్నెస్ మీద ఫోకస్ చేసింది. పాప పుట్టిన నెల రోజులకే ఆలియా బ్యాక్ టూ జిమ్ అంటుంది. మంచి బాడీ కోసం యోగ, జిమ్ చేస్తూ ఇప్పటికే ఫామ్ లోకి వచ్చేసింది ఆలియా.
బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ కూడా ఈ మధ్యనే తల్లైంది. ఎప్పటికప్పుడు స్టైల్ స్టేట్ మెంట్స్ ఇచ్చే ఈ హీరోయిన్ ప్రెగ్నెన్సీ పీరియడ్ లో ఓవర్ వెయిట్ తో సఫర్ అయ్యింది. అయితే కొడుకు పుట్టిన తర్వాత డైటింగ్ తో పాటు యోగా, జిమ్ చేసి ఫిట్నెస్ తో మళ్లీ టోన్డ్ బాడీ షేప్ కి వచ్చేసింది. లేటెస్ట్ గా రెడ్ సీ ఇంటర్నేషనల్ అవార్డ్స్ లో రెడ్ లాంగ్ గౌన్ తో సోనమ్ కి అసలు పెళ్లైందా, పిల్లలున్నారా అనే లుక్ లో కనిపించి సర్ప్రైజ్ చేసింది.
సౌత్ తో పాటు బాలీవుడ్ లో 15 ఏళ్ల హీరోయిన్ కెరీర్ ని కంప్లీట్ చేసుకుని తన ప్రియుడు గౌతమ్ కిచ్లూని పెళ్లి చేసుకుని యాక్టింగ్ కి బ్రేక్ ఇచ్చింది కాజల్. ఆ తర్వాత బాబుని కన్న కాజల్ మళ్లీ ఫిట్నెస్ మీద ఫోకస్ చేసింది. మళ్లీ ఆఫర్లతో బిజీ అవుతున్న కాజల్ మంచి ఫిజిక్ బాడీ రెడీ చేసుకుంటోంది. లేటెస్ట్ గా యాడ్స్, హార్స్ రైడింగ్ తో పాటు ఎయిర్ పోర్ట్ లుక్స్ తో బ్యాక్ టూ ఫామ్ అని ప్రూవ్ చేస్తోంది కాజల్.
Also Read…… రకుల్ ప్రీత్ సింగ్ స్పెషల్ మిర్రర్ ఫొటోషూట్..
సౌత్ హీరోయిన్ ప్రణీత కూడా ఈమధ్యే తల్లైంది. 5 నెలల పోస్ట్ ప్రెగ్నెన్సీ నుంచి రికవరీ అయ్యి ఫిట్ మదర్ అయిపోయింది ప్రణీత. ప్రెగ్నెన్సీ యోగాతో పాటు డెలివరీ తర్వాత తన బేబీతో ఫోటోలు, వీడియోలతో సందడి చేస్తున్న ప్రణీత రెగ్యులర్ గా ఫొటోస్ పోస్ట్ చేస్తుంది. ఫుల్ టైమ్ బేబీకే టైమ్ స్పెండ్ చేస్తూ ఇటు బాడీ మీద కూడా ఫోక్స్ చేసింది.