Hit 2 : హిట్-2 టీజర్ యూట్యూబ్ ట్రేండింగ్ నుంచి తొలిగింపు.. ఏమైంది?
విశ్వక్ సేన్ హీరోగా, నేచురల్ స్టార్ నాని నిర్మాతగా వ్యవహరిస్తూ.. 2020లో 'హిట్ ది ఫస్ట్ కేస్' అనే క్రైమ్ థిల్లర్ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నారు. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ సినిమాకు సీక్వెల్ సిరీస్ ఉండబోతున్నట్లు ప్రకటించిన మూవీ టీం.. ఇప్పుడు అడివి శేషు హీరోగా 'హిట్-2'ని ఆడియన్స్ ముందుకు తీసుకురాబోతున్నారు. ఇటీవలే సినిమా టీజర్ ను మూవీ టీం విడుదల చేయగా, ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలను అమాంతం పెంచేశాయి. ఇక ట్రేండింగ్ లో ఉన్న ఈ టీజర్ ని యూట్యూబ్ సడన్ గా తొలిగించింది.

Hit-2 teaser removed from YouTube trending
Hit 2 : విశ్వక్ సేన్ హీరోగా, నేచురల్ స్టార్ నాని నిర్మాతగా వ్యవహరిస్తూ.. 2020లో ‘హిట్ ది ఫస్ట్ కేస్’ అనే క్రైమ్ థిల్లర్ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నారు. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ సినిమాకు సీక్వెల్ సిరీస్ ఉండబోతున్నట్లు ప్రకటించిన మూవీ టీం.. ఇప్పుడు అడివి శేషు హీరోగా ‘హిట్-2’ని ఆడియన్స్ ముందుకు తీసుకురాబోతున్నారు.
ఇటీవలే సినిమా టీజర్ ను మూవీ టీం విడుదల చేయగా, ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలను అమాంతం పెంచేశాయి. టీజర్ లో అడివి శేషు ఇజ్ అఫ్ యాక్టింగ్ అందర్నీ అలరించగా.. టీజర్ చివరిలో వచ్చే సీన్ మాత్రం అందర్నీ భయపెట్టింది. ఇక ట్రేండింగ్ లో ఉన్న ఈ టీజర్ ని యూట్యూబ్ సడన్ గా తొలిగించింది. దీని గురించి అడివి శేషు స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో విడుదల చేశాడు.
“టీజర్ లో హింసాత్మక సన్నివేశాలు ఉండడంతో యూట్యూబ్ హిట్-2 టీజర్ ని ట్రేండింగ్ లిస్ట్ ని నుంచి తొలిగించింది. అంతేకాకుండా 18 ఏళ్ళ వయసు కంటే తక్కువ వయసు ఉన్న వారు చూడకుండా ఏజ్ రెస్ట్రిక్షన్ కూడా పెట్టింది. భవిషత్తులో ఈ టీజర్ మళ్ళీ చూడాలంటే యూట్యూబ్ లో సైన్ ఇన్ అయ్యి చూడాల్సిందే” అంటూ నిమాలో వైలెన్స్ కాదు రొమాన్స్ కూడా ఉంది. రేపు మూవీలోని ఫస్ట్ సింగల్ ‘ఉరికే ఉరికే’ ఫుల్ సాంగ్ విడుదలకాబోతున్నట్లు వెల్లడించాడు అడివి శేషు.
#HIT2 Teaser got REMOVED from YouTube Trending ? But no worries #UrikeUrike Song out tomorrow ❤️
?@KolanuSailesh pic.twitter.com/vCYRu3HIHu
— Adivi Sesh (@AdiviSesh) November 9, 2022