Krishnam Raju: కృష్ణంరాజు మృతికి కారణాన్ని వెల్లడించిన ఆస్పత్రి వర్గాలు..

టాలీవుడ్ ప్రముఖ నటుడు, మాజీ కేంద్ర మంత్రి కృష్ణంరాజు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం తెల్లవారు జామున కన్నుమూశాడు. 82ఏళ్ల వయస్సు కలిగిన ఆయనకు మధుమేహం తో పాటు పోస్ట్ కోవిడ్, తీవ్రమైన కార్డియాక్ అరెస్ట్ రావడంతో మృతిచెందినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

Krishnam Raju: కృష్ణంరాజు మృతికి కారణాన్ని వెల్లడించిన ఆస్పత్రి వర్గాలు..

Rebel star Krishnam Raju

Krishnam Raju: టాలీవుడ్ ప్రముఖ నటుడు, మాజీ కేంద్ర మంత్రి కృష్ణంరాజు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం తెల్లవారు జామున కన్నుమూశాడు. కృష్ణంరాజు మృతిపట్ల సినీ ప్రముఖులతో పాటు, రాజకీయ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు పలువురురాజకీయ సినీ ప్రముఖులు కృష్ణంరాజు మరణవార్త తెలుసుకొని దిగ్భ్రాంతికి గురయ్యారు. వారి ఆత్మకు శాంతి కలగాలని పార్థిస్తూ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు.

Rebel Star Krishnam Raju: కృష్ణంరాజు సినీ ప్రయాణం.. రెబల్ స్టార్ అనే బిరుదు ఎలా వచ్చింది?

ఇదిలాఉంటే.. కృష్ణంరాజు గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. 82ఏళ్ల వయస్సు కలిగిన ఆయనకు మధుమేహం తో పాటు పోస్ట్ కోవిడ్, తీవ్రమైన కార్డియాక్ అరెస్ట్ రావడంతో మృతిచెందినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. కృష్ణంరాజు దీర్ఘకాలంగా మూత్రపిండాలు, ఊపిరితిత్తుల సమస్యతో ఇబ్బంది పడుతున్నాయి. పోస్ట్ కోవిడ్ సమస్య కారణంగా గతనెల 5న ఆస్పత్రిలో చేరినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఆస్పత్రిలో చేరిన తరువాత మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా కారణంగా ఊపిరితిత్తుల్లో తీవ్ర న్యుమోనియా ఉన్నట్లు గుర్తించామని, కిడ్నీ పనితీరు పూర్తిగా దెబ్బతినడంతో ఆస్పత్రిలో చేరిన నాటినుంచి వెంటిలేటర్ పై చికిత్స అందించామని ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు.

Krishnam Raju: కృష్ణంరాజు మృతిపై తెలంగాణ సీఎం కేసీఆర్ సహా పలువురి సంతాపం

ఆదివారం తెల్లవారుజామున 3.16 గంటలకు తీవ్రమైన గుండెపోటు రావడంతో కృష్ణంరాజు తుదిశ్వాస విడిచినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. అయితే ఈ రోజు మధ్యాహ్నం 12గంటల తర్వాత కృష్ణంరాజు పార్థివదేహాన్ని ఇంటికి తీసుకురానున్నారు. ప్రముఖులు, అభిమానుల సందర్శనార్థం పార్ధివదేహాన్ని అందుబాటులో ఉంచుతారు. సోమవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.