Oscar Awards : ఆస్కార్ అవార్డ్స్ పై ఇండియన్స్ ఫైర్.. కమిటీని ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..

ప్రతి సంవత్సరం ఆస్కార్ అవార్డ్స్ టైంలో ‘ఇన్‌ మెమోరియమ్‌’ అనే పేరుతో ప్రపంచవ్యాప్తంగా ఆ సంవత్సరంలో చనిపోయిన సినీ రంగానికి చెందిన గొప్పవారిని తలచుకుంటారు. గత సంవత్సరం.........

Oscar Awards : ఆస్కార్ అవార్డ్స్ పై ఇండియన్స్ ఫైర్.. కమిటీని ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..

Oscar

Oscar Awards :  ప్రతిష్టాత్మక 94వ ఆస్కార్‌ ఆస్కార్‌ అవార్డులు 2022 వేడుక మార్చ్ 27న అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. అవార్డులు అందుకున్న వారంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆస్కార్‌ అవార్డు కమిటీపై ఇండియన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

ప్రతి సంవత్సరం ఆస్కార్ అవార్డ్స్ టైంలో ‘ఇన్‌ మెమోరియమ్‌’ అనే పేరుతో ప్రపంచవ్యాప్తంగా ఆ సంవత్సరంలో చనిపోయిన సినీ రంగానికి చెందిన గొప్పవారిని తలచుకుంటారు. గత సంవత్సరం 93వ ఆస్కార్‌ అవార్డ్స్‌ 2021 సమయంలో మన దేశం నుంచి రిషి కపూర్, ఇర్ఫాన్‌ ఖాన్, సుశాంత్‌ సింగ్‌ రాజ్‌‌పుత్‌లకు ఆస్కార్‌ ‘ఇన్‌ మెమోరియమ్‌’లో స్థానం కల్పించి వారిని తలుచుకున్నారు. అయితే ఈ సారి భారతదేశం నుంచి మరణించిన గొప్పవారిలో కనీసం ఒక్కరి పేరు కూడా ప్రస్తావించలేదు.

Oscar Awards : చెంపదెబ్బ ఘటన.. విల్‌స్మిత్ ఆస్కార్ వెనక్కి తీసుకుంటారా??

ఈ సారి 94వ ఆస్కార్‌ ఆస్కార్‌ అవార్డులు 2022 వేడుకలో ‘ఇన్‌ మెమోరియమ్‌’ విభాగంలో దివంగత ప్రముఖ గాయని లతా మంగేష్కర్, దివంగత ప్రముఖ నటుడు దిలీప్‌ కుమార్‌ పేర్లను కనీసం ప్రస్తావించలేదు అని భారత సినీ ప్రియులు ఈ విషయంపై ఆస్కార్ అవార్డు కమిటీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది వీరిని ఎలా మర్చిపోయారంటూ ట్వీట్స్ చేస్తూ ఆస్కార్ కమిటీని ట్యాగ్ చేస్తున్నారు. మరి ఆస్కార్ అవార్డుల సంస్థ ‘ది అకాడమి’ దీనిపై వివరణ ఏమైనా ఇస్తుందేమో చూడాలి.