శైలపుత్రీ దేవిగా నిత్యా.. ఆదా శర్మ.. ?..

  • Published By: sekhar ,Published On : September 18, 2020 / 05:50 PM IST
శైలపుత్రీ దేవిగా నిత్యా.. ఆదా శర్మ.. ?..

Gamanam, Question Mark Looks: రియల్‌ లైఫ్‌ డ్రామాతో దర్శకుడు సుజనారావు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో తెరకెక్కిస్తోన్న పాన్ ఇండియా మూవీ ‘గమనం’. ఈ సినిమాలో నటిస్తోన్న నిత్యామీనన్‌ లుక్‌ను హీరో శర్వానంద్‌ తన ట్విట్టర్‌ ద్వారా శుక్రవారం విడుదల చేశారు.


శైలపుత్రీ దేవి అనే శాస్త్రీయ సంగీత గాయని పాత్రలో నిత్యామీనన్‌ లుక్‌ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి శ్రియా లుక్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. సినిమాటోగ్రాఫర్‌ జ్ఞ్ఞానశేఖర్‌ వి.ఎస్‌. నిర్మాతగా మారి రమేశ్‌ కరుటూరి, వెంకీ పుషడపుతో కలిసి ఈ సినిమా నిర్మిస్తున్నారు.


సినిమా చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే విడుదలకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది. మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి సాయిమాధవ్‌ బుర్రా మాటలు అందిస్తున్నారు.


శ్రీ కృష్ణ క్రియేషన్స్ పతాకంపై ఆదా శర్మ నటిస్తున్న లేడి ఓరియంటెండ్ చిత్రం.. ‘క్వశ్చన్ మార్క్’. విప్రా దర్శకత్వంలో గౌరీ కృష్ణ నిర్మిస్తోన్న ఈ చిత్ర పోస్ట‌ర్‌ను శుక్రవారం మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ విడుదల చేశారు.


ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ…క‌రోనా వల్ల ప్ర‌జ‌ల‌కు ఎంట‌ర్‌టైన్‌మెంట్ క‌రువైంది. ఇలాంటి త‌రుణంలో ఒక‌ మంచి మెసేజ్‌తో వ‌స్తోన్న ఈ చిత్రం విజ‌యం సాధించి ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు, హీరోయిన్‌కు, ఇత‌ర యూనిట్ స‌భ్యుల‌కు మంచి పేరు తీసుకురావాల‌ని అన్నారు.