మహర్షితో మేము సైతం..

మహర్షితో రెండు కొత్త సినిమాల ట్రైలర్స్ యాడ్ చేసారు. యాంగ్రీస్టార్ రాజశేఖర్ నటిస్తున్న 'కల్కి', బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 'సీత' సినిమాల ట్రైలర్స్ మహర్షి ఆడుతున్న థియేటర్స్‌లో ప్రదర్శిస్తున్నారు..

  • Published By: sekhar ,Published On : May 9, 2019 / 05:39 AM IST
మహర్షితో మేము సైతం..

మహర్షితో రెండు కొత్త సినిమాల ట్రైలర్స్ యాడ్ చేసారు. యాంగ్రీస్టార్ రాజశేఖర్ నటిస్తున్న ‘కల్కి’, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘సీత’ సినిమాల ట్రైలర్స్ మహర్షి ఆడుతున్న థియేటర్స్‌లో ప్రదర్శిస్తున్నారు..

సూపర్ స్టార్ మహేష్ బాబు, పూజాహెగ్డే జంటగా, వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో, వైజయంతీ మూవీస్.. అశ్వినీదత్, శ్రీ వెకటేశ్వర క్రియేషన్స్.. దిల్ రాజు, పివిపి సినిమా.. పెరల్ వి.పొట్లూరి – పరమ్ వి.పొట్లూరి కలిసి నిర్మించిన మహేష్ 25వ సినిమా, మహర్షి మే 9న గ్రాండ్‌గా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ థియేటర్లు  మహర్షికే కేటాయించారు. జనరల్‌గా కొత్త సినిమాతో పాటు అప్ కమింగ్ మూవీస్ థియేట్రికల్ ట్రైలర్స్ రిలీజ్ చెయ్యడం జరుగుతుంటుంది.

సినిమా స్టార్ట్ అయ్యే ముందు కానీ, ఇంటర్వెల్ టైమ్‌లో కానీ, ఆ ట్రైలర్స్ ప్లే చేస్తుంటారు. మహర్షితో రెండు కొత్త సినిమాల ట్రైలర్స్ యాడ్ చేసారు. యాంగ్రీస్టార్ రాజశేఖర్ నటిస్తున్న ‘కల్కి’, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘సీత’ సినిమాల ట్రైలర్స్ మహర్షి ఆడుతున్న థియేటర్స్‌లో ప్రదర్శిస్తున్నారు.

‘గరుడవేగ’ మూవీతో ఫామ్‌లోకి వచ్చిన రాజశేఖర్, ‘అ!’ వంటి డిఫరెంట్ సినిమాతో ఆడియన్స్‌‌ని ఆకట్టుకున్న యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబోలో తెరకెక్కుతున్న కల్కిపై మంచి అంచనాలున్నాయి. ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాతో సక్సెస్ అందుకున్న సీనియర్ దర్శకుడు తేజ, హిట్ కోసం అల్లాడుతున్న బెల్లంకొండ సాయితో చేస్తున్న సినిమా.. సీత.. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుంది.. మే 24న సీత రిలీజ్ కానుంది.