Rachita Ram: ఫస్ట్ నైట్ గురించి స్టేట్మెంట్ ఇచ్చి వివాదాల్లో హీరోయిన్
ప్రెస్ మీట్‌లో నోరుజారిన హీరోయిన్ వివాదాల్లో ఇరుక్కుంది. కన్నడ ఇండస్ట్రీకి చెందిన నటి రచిత రామ్ సినిమా లవ్ యూ రచ్చు టీజర్ రీసెంట్ గా రిలీజైంది. వీటి ప్రమోషన్స్ లో భాగంగానే....

Love You Rachchu
Rachita Ram: ప్రెస్ మీట్‌లో నోరుజారిన హీరోయిన్ వివాదాల్లో ఇరుక్కుంది. కన్నడ ఇండస్ట్రీకి చెందిన నటి రచిత రామ్ సినిమా లవ్ యూ రచ్చు టీజర్ రీసెంట్ గా రిలీజైంది. వీటి ప్రమోషన్స్ లో భాగంగానే ప్రెస్ మీట్ నిర్వహించారు. టీజర్ గురించి ప్రశ్నించిన విలేకరితో నేరుగా భార్యభర్తల మధ్య ఉండే రొమాన్స్ బయటకు చూపించాం. అందులో తప్పేంటి అనే నేరుగా అడిగేసింది.
‘బోల్డ్ కంటెంట్‌తో ఉన్న సినిమాలో నటించడానికి కారణం ఏమిటి?’’ అని ప్రశ్నించిన రిపోర్టరుతో.. ‘ఇక్కడ ఉన్న వాళ్లంతా పెళ్లైన వాళ్లే అనుకుంటున్నా. సిగ్గు పడటానికి ఏం లేదు. సాధారణంగా అడుగుతున్నా పెళ్లి అయిన తర్వాత ఏం చేస్తారు. రొమాన్సే చేస్తారు కదా. అదే సినిమాలో చూపించాం. ఆ సీన్స్ వెనుక ఒక కారణం ఉంది. సినిమా చూస్తే అది అర్థం అవుతుంది. మీకు పిల్లలు పుట్టేశారా.. చెప్పండి’ అంటూ కామెంట్స్ చేసి నవ్వేసింది.
………………………: జెర్సీ దర్శకుడితో స్పోర్ట్స్ డ్రామా.. చెర్రీ కల తీరేవేళ!
కన్నడ కాంతి దల్ రచిత వ్యాఖ్యల్ని తప్పుపడుతూ తీవ్రంగా ఖండించింది. వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ వినిపించింది. కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వెంటనే బహిష్కరించాలంటూ కూడా కామెంట్లు చేస్తుండటం గమనార్హం. అంత ట్రోలింగ్ కు గురవుతున్న టీజర్ పై మీరూ ఓ లుక్కేయండి..