Naga Chaitanya: నాగచైతన్య సినిమాలో వంటలక్క..

అక్కినేని హీరో నాగ చైతన్య తన 22వ సినిమా కోసం కోలీవుడ్ దర్శకుడు వెంకట్ ప్రభుతో జత కడుతున్నాడు. ఇది చైతన్య చేస్తున్న మొదటి తమిళ-తెలుగు బై లింగువల్ మూవీ. తాజాగా చిత్ర యూనిట్ ఈ సినిమాలో నటించబోయే నటీనటుల వివరాలను విడుదల చేసింది. అరవింద్ స్వామి, శరత్ కుమార్, ప్రియమణి, సంపత్ రాజ్, వెన్నల కిషోర్ నటీనటులు ఈ సినిమాలో భాగం కాబోతున్నారు. అలాగే...

Naga Chaitanya: నాగచైతన్య సినిమాలో వంటలక్క..

Karthika Deepam Fame Vantalakka in Naga Chaitanya New Movie

Naga Chaitanya: అక్కినేని హీరో నాగ చైతన్య తన 22వ సినిమా కోసం కోలీవుడ్ దర్శకుడు వెంకట్ ప్రభుతో జత కడుతున్నాడు. ఇది చైతన్య చేస్తున్న మొదటి తమిళ-తెలుగు బై లింగువల్ మూవీ. తాజాగా చిత్ర యూనిట్ ఈ సినిమాలో నటించబోయే నటీనటుల వివరాలను విడుదల చేసింది. అరవింద్ స్వామి, శరత్ కుమార్, ప్రియమణి, సంపత్ రాజ్, వెన్నల కిషోర్ నటీనటులు ఈ సినిమాలో భాగం కాబోతున్నారు.

Naga Chaitanya: ఆమెతో లవ్ స్టోరీ.. నాకెన్నో పాఠాలు నేర్పింది.. నాగచైతన్య!

అలాగే బుల్లితెరపై వంటలక్కగా పేరుగాంచిన ‘ప్రేమి విశ్వనాథ్’ ఈ సినిమాతో వెండితెరకు పరిచయం కాబోతుంది. తెలుగు టీవీ సీరియల్ కార్తీక దీపంలో దీప పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రేమి.. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర పోషించబోతోంది. మరి వంటలక్క ఫేమ్ ఈ సినిమాకు ఎంతవరకు హెల్ప్ అవుతుందో చూడాలి.

యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అక్కినేని హీరో పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించనున్నాడట. ‘బంగార్రాజు’ సినిమా తర్వాత మరోసారి ‘కృతి శెట్టి’ చైతో జోడి కడుతుంది. ఇప్పటికే ఈ సినిమా మొదటి షెడ్యూల్ ని పూర్తీ చేసుకుని కొత్త షెడ్యూల్ కోసం సిద్ధమవుతోంది. ఇక ఈ సినిమాకు ఇళయరాజా అండ్ యువన్ శంకర్ రాజా సంగీతం అందించనున్నారు.