Karthikeya 2: కార్తికేయ-2.. ఓటీటీకి వచ్చేది అప్పుడేనా..?

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటించిన తాజా చిత్రం ‘కార్తికేయ-2’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ అందుకుంది. ఈ సినిమాను దర్శకుడు చందు మొండేటి తెరకెక్కించిన తీరు అత్యద్భుతంగా ఉండటంతో ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఈ సినిమాను త్వరలోనే ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

Karthikeya 2: కార్తికేయ-2.. ఓటీటీకి వచ్చేది అప్పుడేనా..?

Karthikeya 2 To Set OTT Release Date

Karthikeya 2: టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటించిన తాజా చిత్రం ‘కార్తికేయ-2’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ అందుకుంది. ఈ సినిమాను దర్శకుడు చందు మొండేటి తెరకెక్కించిన తీరు అత్యద్భుతంగా ఉండటంతో ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఇక ఈ సినిమాకు నార్త్ బెల్ట్‌లోనూ కళ్లు చెదిరే రీతిలో కలెక్షన్లు వస్తుండటంతో పాన్ ఇండియా మూవీగా కార్తికేయ-2 బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది.

Karthikeya 2 : బాలీవుడ్ టాప్ 10 లో కార్తికేయ 2.. సరికొత్త రికార్డ్ సృష్టించిన నిఖిల్..

ఇక ఈ సినిమాను త్వరలోనే ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇంకా థియేటర్లలో సాలిడ్ కలెక్షన్స్‌తో దూసుకెళ్తున్న సినిమాను ఓటీటీలోకి తీసుకొస్తే, ఎవరైతే ఈ సినిమాను చూడలేదో, వారికి అందుబాటులో ఉంటుందని పలువురు కోరుతున్నారు. అయితే బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం జీ5 భారీ రేటుకు కొనుగోలు చేసింది.

Karthikeya 2 : నిఖిల్ ఏంటి..? బాలీవుడ్ కి వెళ్లడమేంటి..?.. కర్నూలు గడ్డ మీద కార్తికేయ 2 వంద కోట్ల సెలబ్రేషన్స్.. స్పీచ్ అదరగొట్టిన నిఖిల్

కార్తికేయ-2 చిత్రాన్ని అన్ని భాషల్లో సెప్టెంబర్ 30 నుండి ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేందుకు చిత్ర యూనిట రెడీ అవుతోందట. అయితే ఈ సినిమాను నిజంగా సెప్టెంబర్ 30 నుండి ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తారా అనే విషయంపై మాత్రం అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. ఈ సినిమాలో నిఖిల్ పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇక అందాల భామ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో శ్రీనివాస రెడ్డి, వైవా హర్షా, అనుపమ్ ఖేర్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి కాళభైరవ సంగీతాన్ని అందించాడు.